Huzurabad | ఈటలకు షాక్.. ‘గెల్లు’కే మా ఓటన్న ముదిరాజ్‌లు
Huzurabad | హుజూరాబాద్ మండల పరిధిలోపి పెద్ద పాపయ్యపల్లెకు చెందిన ముదిరాజ్ కులస్తులు టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే తమ ఓటు అని తీర్మానించారు. ఈ మేరకు మంత్రి గంగుల

టీఆర్ఎస్లో చేరిన పెద్ద పాపయ్యపల్లి ముదిరాజ్‌లు
గెల్లు గెలుపునకు కృషి చేస్తాం
హుజూరాబాద్ : హుజూరాబాద్ మండల పరిధిలోపి పెద్ద పాపయ్యపల్లెకు చెందిన ముదిరాజ్ కులస్తులు టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే తమ ఓటు అని తీర్మానించారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌కు ముదిరాజ్‌లు తమ మద్దతు లేఖ అందజేసి.. సుమారు 100 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి గంగుల గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులు చాలా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. చేపపిల్లల పంపకంతో పాటు, వలలు, ఆధునిక మరబోట్లు ఇతర సామాగ్రిని అందించి మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంటే ఉంటామని వారు తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గట్టు పద్దయ్య, సభ్యులు భిక్షపతి, కొమురయ్య, చిన్న రాజయ్య, రామయ్య, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

