జర్నలిస్టులపై వేధింపులు అన్యాయం
ప్రజాస్వామ్యం దేశంలో ప్రశ్నించే జర్నలిస్టులను వేధింపులకు గురిచేయడం అన్యాయమని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఆవేదన వ్యక్తంచేశారు. ఇండిపెండెంట్ జర్నలిస్టు రేఖను పోలీసులు గంటల తరబడి పోలీస్‌స్టేషన్‌లో విచారించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
- రేఖపై గంటల తరబడి విచారణ తీవ్ర అభ్యంతరకరం
- ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన రామారావు ఇమ్మానేని
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్ : ప్రజాస్వామ్యం దేశంలో ప్రశ్నించే జర్నలిస్టులను వేధింపులకు గురిచేయడం అన్యాయమని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఆవేదన వ్యక్తంచేశారు. ఇండిపెండెంట్ జర్నలిస్టు రేఖను పోలీసులు గంటల తరబడి పోలీస్‌స్టేషన్‌లో విచారించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. చంటిపాప ఉన్నదని కూడా చూడకుండా గురువారం పోలీసులు రేఖను విచారించిన ఘటనపై ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించి పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ, దానికి నంబర్ అలాట్ చేసినట్టు రామారావు తెలిపారు. పోలీసులు అత్యుత్సాహంతో చంటిపాపతో వచ్చిన జర్నలిస్టు రేఖపై ఏమాత్రం కనికరం, మానవత్వం లేకుండా విచారించిన తీరుపై డీజీపీ సీవీ ఆనంద్‌తో విచారణ చేయించాలని కోరారు. విచారణ ఎవరిని చేస్తున్నారు? ప్రశ్నించేవారినా? మోసాలకు పాల్పడుతున్న వారినా? అనేదానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

