హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రిని బుధవారం పలు సంఘాలు, అసోసియేషన్ల నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీ టీ చర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరశురాం, ప్రధాన కార్యదర్శి నిరంజన్ నేతృత్వంలోని బృందం, ఇంటర్ విద్యా జేఏసీ నేత మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు.