హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీసు స్టేషన్ దేశంలోని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో 5వ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలేరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అందరికీ రాష్ట్రం హోంశాఖ మంత్రి మహముద్ అలీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీసు స్టేషన్ల టాప్ 75 జాబితాలో ఆలేరు పోలీస్ స్టేషన్ నిలిచింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన దేశంలోని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో ఆలేరు పోలీసు స్టేషన్ 5వ స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో ఆలేరు పోలీసు స్టేషన్ అత్యుత్తమ స్టేషన్గా నిలిచింది. అయితే పోలీసు స్టేషన్ల పనితీరు, మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. అదే సమయంలో పౌరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
Hearty Congratulations to all Officers of Alair PS.@RachakondaCop @Alair_PS @TelanganaCOPs @TelanganaDGP @KTRTRS @TelanganaCMO https://t.co/27NuHoIvTB
— Mohammed Mahmood Ali (@mahmoodalitrs) April 29, 2022