Himayat sagar : ఉప్పొంగిన ఈసీ వాగు.. నీట మునిగిన పంటలు
హిమాయత్‌సాగర్ జలాశయం 10గేట్లు ఎత్తివేత

మొయినాబాద్ : మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చేవెళ్ల, పూడురు, పరిగి, షాబాద్, మొయినాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామ సమీపంలో ఉన్న వంతెన వద్ద ఈసీ వాగు ఉప్పొంగడంతో వాగుకు ఇరువైపుల అర కిలోమీటరు దూరంలో వరద నీరు విస్తరించుకుంటూ ప్రవహించింది. వాగుకు ఇరువైపుల ఉన్న పంట పొలాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తున్న హిమాయత్‌సాగర్ జలాశయంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాగుకు ఇరువైపుల ఉన్న అమ్డాపూర్, బాకారం, నాగిరెడ్డిగూడ, కాశీంబౌలి, శంషాబాద్ మండల పరిధిలోని కేబీ దొడ్డి, సుల్తాన్‌పల్లి గ్రామాల పంట పొలాలు ఈసీ వాగుకు అనుకుని ఉండటంతో పంట పొలాలోకి వరద నీరు చేరి పంటలు మునిగిపోయాయి. రైతుల చేతికి పంట వచ్చే సమయంలో పంటలు వరద నీటిలో మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారుగా 3 వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
10గేట్లు ఎత్తి దిగువకు వదిలిన వరద నీరు
హిమాయత్‌సాగర్ జలాశయంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలాశయంలోని నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. ఉదయం 11 గంటలకు 4గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు వదిలారు. జలాశయంలోనికి వరద ఉధృతి ఎక్కువ కావడంతో 12గంటలకు ముందు 8గేట్లు ఎత్తారు. భారీగా ఇన్‌ప్లో ఉండటంతో 12 గంటలకు అధికారులు 10 గేట్లు ఎత్తారు. జలాశయం నుంచి వరద నీరు దిగువ ప్రాంతానికి వదలడంతో గేట్లు చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున జలాశయానికి చేరుకున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

