కరోనాకు మూలికా వైద్యం
- అందుబాటులో పలు సంప్రదాయ ఔషధాలు
- కబాసురా కుద్నీర్, నీలవేంబు కషాయం
- రూ.138కే కబాసురా కుద్నీర్ లభ్యం
- ఆమోదం తెలిపిన ఆయూష్ డిపార్ట్మెంట్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి విరుగుడుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చా యి. భారత్‌లో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ టీకాల కొరత కుంగుబాటుకు గురిచేస్తున్నది. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన ఎస్కేఎం సిద్ధ అండ్ ఆయుర్వేద కంపెనీ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ సంప్రదాయ ఔషధాన్ని ఆవిష్కరించింది. కబాసురా కుద్నీర్ పేరిట మార్కెట్లోకి విడుదలచేసింది. దీని ధర రూ.138 కాగా, ఈ మందు ఇమ్యూనోస్టిమ్యులేటర్గానే కాకుండా, ఇమ్యూనోమోడ్యులేటర్గానూ పనిచేస్తుండటం విశేషం. దీనిని ఆయూష్ డిపార్ట్మెంట్ సైతం ఆమోదించింది.
ప్రత్యేకత.. ప్రయోజనాలు
చెన్నైలోని లయోలా కళాశాల విస్తృత పరిశోధనలను సాగించి కుద్నీర్ కబాసురా మూలికా ఔషధాన్ని తయారుచేసింది. పుదినా, తులసి, పసుపు, లవంగం, కరివేపాకు, చుక్కు, తిప్పిలి తదితర 15 రకాల మూలికా రసాల మిశ్రమమే ఈ ఔషధం. దీనిని డికాషన్‌లా తాగడం, అవిరిపీల్చడం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 98 శాతం మేర కరోనా లక్షణాలకు కూడా నివారిస్తున్నదని కేంద్ర ఆయుష్ డిపార్ట్మెంట్ సైతం అధికారికంగా నిర్ధారించింది. ప్రస్తుతం ఈ ఔషధాన్ని తమిళనాడు ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ ఔషధాన్ని రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం భోజనం తరువాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందించడమేకాకుండా వైరల్ వ్యాప్తిని నియంత్రించడంలో ఎంతో తోడ్పడుతుందని ఆయూష్ డిపార్ట్మెంట్ తెలిపింది.
ఇతర ఔషధాలు
కరోనా చికిత్సకు ఉపయోగకరమైన ఇతర ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. నీలవేంబు కషాయం ఇందులో ఒకటి. రోజుకు రెండుసార్లు భోజనం తరువాత తీసుకోవాలి. ఇది అన్నిరకాల వైరల్ ఇన్ఫెక్షన్లను దూరంచేస్తుంది. డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధుల నివారణకు ఈ కషాయం పేరుపొందింది. నెల్లికా లేహ్యాన్ని రోజూ ఒక టీస్పూన్ భోజనం తరువాత తీసుకోవాలి. ఇవిగాక ఆయుష్ 64 గుళికలను రోజుకు రెండు చొప్పున వాడాలి. ఆగస్త్య హరీటాకై చుర్ణాన్ని వేడినీటితో కలిపి రోజుకు ఒకసారి తీసుకొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

