రచయిత కందికొండకు అండగా నిలవండి

- తీవ్ర అనారోగ్యానికి గురైన గేయ రచయిత
- ఆదుకోవాలని కుటుంబసభ్యుల వేడుకోలు
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతిని నిలువునా దట్టించుకున్న గేయ రచయిత కందికొండ యాదగిరి అనారోగ్యం పాలయ్యారు. కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమను ఆదుకోవాలని కందికొండ కుటుంబసభ్యులు, మిత్రులు వేడుకొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలోని పేద కుటుంబంలో పుట్టిన యాదగిరి.. కందికొండ పేరుతో తెలుగు చిత్రసీమకు పరిచయమై గేయరచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమా పాటలు.. మరోవైపు బతుకమ్మ, బోనాలు వంటి పండుగతోపాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన రాసిన పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. 15 ఏండ్ల క్రితమే క్యాన్సర్ బారినపడిన కందికొండ.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆర్థిక వెనుకబాటుతనం వల్ల ఆయన కుటుంబం చేయూత కోసం ఎదురుచూస్తున్నది. సహాయం చేయాలని అర్థిస్తున్నది. ప్రత్యక్షంగా కానీ, గూగుల్‌పే ద్వారా (నంబర్ 81793 10687) లేదా Andhra Bank Account Details: Kandikonda Rama Devi Account No: 135510100174728, IFSC Code: ANDB0001355 సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కందికొండకు కేటీఆర్ చేయూత
ప్రముఖ గేయ రచయిత కందికొండ కుటుంబానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు. కందికొండ అనారోగ్యంతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ వైద్యానికయ్యే ఖర్చులు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2.5 లక్షల సహాయం అందేలా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

