భారీ వర్షం.. పొంగుతున్న వాగులు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. బీకే తిర్మలాపూర్ చెరువు నిండుకుండలా మారింది. మొల్కమామిడిలోని బండలదేవి చెరువు, ధర్మసముద్రం, తుర్కల చెరువు అలుగుపారాయి.
- ఉమ్మడి పాలమూరులో భారీ వర్షం
- వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి
- 4 రోజుల్లో రాష్ట్రమంతటా నైరుతి
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. బీకే తిర్మలాపూర్ చెరువు నిండుకుండలా మారింది. మొల్కమామిడిలోని బండలదేవి చెరువు, ధర్మసముద్రం, తుర్కల చెరువు అలుగుపారాయి. కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్-ముక్కిడిగుండం గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఉప్పొంగింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆయా కాలనీలు నీటమునిగాయి. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం గౌరి గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. స్థానిక హనుమాన్ ఆలయం పైక ప్పు రేకులు ఎగిరిపోయాయి. పెద్ద వృక్షాలు నేలకూలాయి. విద్యుత్తు తీగలు తెగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైం ది. పిడుగుపాటుకు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురు చొప్పున, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకరు మృతిచెందారు.
మరో మూడు రోజులు వర్షాలు
రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని తెలిపింది. హైదరాబాద్, కుమ్రంభీం, మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, నారాయణ్‌పేట్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని అంచనా వేసింది.
కుండపోత వర్షాలపై అప్రమత్తత : సీఎస్
రాష్ట్రంలో ఆకస్మికంగా కుండపోత వర్షం కురిస్తే తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, శాశ్వ త నివారణ చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం ఆమె సచివాలయంలో పలు విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైదరాబాద్‌లో 134 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని తెలిపా రు. సమీక్షలో డీజీపీ రవి గుప్తా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, విపత్తుల నిర్వహణ, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

