TG Weather | వచ్చే మూడ్రోజులు భగభగలే.. మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు
TG Weather | రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు భానుడు భగభగమంటున్నాడు. దీంతో పెరిగిన ఎండవేడితోపాటు ఉకపోతతో జనం అల్లాడిపోతున్నారు.
TG Weather | హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు భానుడు భగభగమంటున్నాడు. దీంతో పెరిగిన ఎండవేడితోపాటు ఉకపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణలో భానుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చనున్నట్టు హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్జ్, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. ముఖ్యంగా ఈనెల 16,17,18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు తీవ్రస్థాయిలో వీచే అవకాశాలు ఉన్నాయని వివరించింది. గురువారం ఆదిలాబాద్ జిల్లాల్లో 44.7 డిగ్రీలు, జగిత్యాలలో 44.6, నిర్మల్లో 44.6, పెద్దపల్లిలో 44.6, నిజామాబాద్లో 44.5, కామారెడ్డిలో 44.2, సిద్దిపేటలో 44.2 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో 42 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. పెరిగిన ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్లో బ్లడీ రోమియో
Agniveer Scheme | అగ్నివీరుల పెండ్లి నిబంధనల్లో మార్పు? మినహాయింపు ఇచ్చే అవకాశం
Supreme Court | అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ‘24 గంటల గడువు’.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

