అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి
ఖమ్మం : ఓ ప్రధానోపాధ్యాయుడు అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వైరాలోని ఓ థియేటర్లో ఆదివారం రోజు సిరిపురం జడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులకు గాంధీ సినిమా చూపించారు. ఈ సినిమాకు విద్యార్థులతో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావు కూడా వచ్చాడు. విద్యార్థినుల మధ్య కూర్చొన్న రామారావు వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు.
ఇక సోమవారం పాఠశాలకు వచ్చిన రామారావును విద్యార్థినుల తల్లిదండ్రులు చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. అక్కడ్నుంచి ప్రధానోపాధ్యాయుడు తప్పించుకుని, సర్పంచ్ ఇంట్లో తలదాచుకున్నాడు. ఇక పోలీసులు కూడా వచ్చేశారు. రామారావును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రామారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

