Harish Rao | ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలయ్యేదాకా నిద్రపోము: హరీశ్‌రావు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టంచేశారు. త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు రావడం తథ్యమని, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
- త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు తథ్యం
- బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి
- ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూతపడదు
- వైఎస్ హయాంలో 12మందిని చేర్చుకున్నరు అయినా రాష్ట్రం సాధించి పదేండ్లు పాలించాం
- రుణమాఫీపై సర్కారు కొత్త జీవో ఇవ్వాలి
- పటాన్చెరులో మీడియాతో హరీశ్‌రావు
- కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా
Harish Rao | సంగారెడ్డి, జూలై 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టంచేశారు. త్వరలో రాష్ట్రంలో ఉపఎన్నికలు రావడం తథ్యమని, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బుధవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో హరీశ్‌రావు సమావేశమయ్యారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీ మారినా ఎవ్వరూ అధైర్యపడవద్దని, కార్యకర్తలకు పార్టీ, తాను అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టబోమని, మళ్లీ ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని చెప్పారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. ఇదే విషయమై హైకోర్టులో కేసు వేశామని, త్వరలో సుప్రీంకోర్టుకు సైతం వెళ్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కండువాలు కప్పడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదేవిధంగా 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ను ఇబ్బందిపెట్టే కుట్రలు చేశారని చెప్పారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రావడంతోపాటు పదేండ్లు అద్భుతమైన పాలన అందించామని అన్నారు. ఇప్పుడు కూడా ఎవ్వరి కుట్రలు పనిచేయవని, ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని హరీశ్‌రావు తెలిపారు.
మహిపాల్‌రెడ్డికి ఎలా మనసొప్పిందో
తల్లిలా ఆదరించి మూడుసార్లు ఎమ్మెల్యేను చేసిన బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి మనసెలా ఒప్పిందో అర్థం కావడం లేదని హరీశ్‌రావు అన్నారు. మహిపాల్‌రెడ్డికి పార్టీ ఏమి తక్కువ చేసిందని ప్రశ్నించారు. పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడితేనే ఆయన మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో పటాన్చెరు నియోజకవర్గానికి నిధుల వరద పారించి అభివృద్ధి చేశామని అన్నారు. మహిపాల్‌రెడ్డి పార్టీ నుంచి పోయినా బీఆర్ఎస్ క్యాడర్ గుండె ధైర్యాన్ని కోల్పోవద్దని హరీశ్‌రావు కోరారు. పటాన్చెరు నాయకులు, కార్యకర్తలకు పార్టీ, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పటాన్చెరు నియోజకవర్గంపై మళ్లీ గులాబీజెండా ఎగరడం ఖాయమని అన్నారు.
పంట రుణమాఫీ జీవో మార్చాల్సిందే
రేవంత్‌రెడ్డి సర్కార్ పంట రుణమాఫీ జీవోను మార్చాల్సిందేనని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రేషన్‌కార్డు, కుటుంబాల ఆధారంగా పంట రుణమాఫీ చేస్తామని జీవో ఇచ్చి, ఇప్పుడేమో రేషన్‌కార్డు వద్దు పాస్‌బుక్ చాలు అంటున్నారని చెప్పారు. రుణమాఫీకి సీఎం నోటిమాటలు చెల్లవని, కొత్తజీవోలు కావాలని అన్నారు. పీఎం కిసాన్ నిబంధనలు లేకుండానే రుణమాఫీ చేయాలని హరీశ్‌రావు కోరారు.
ఆరునూరైనా మళ్లీ అధికారం బీఆర్ఎస్దే
ఆరునూరైనా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ రెండోసారి అధికారంలోకి రాలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురికాకుండా పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని కోరారు. రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వం, కార్యకర్తల సంక్షేమంపై మరింత దృష్టిపెడతామని తెలిపారు. పార్టీ క్యాడర్‌ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్‌రెడ్డి, మెట్టుకుమార్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్లు రోజాబాల్రెడ్డి, లలితాసోమిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, శ్రీధర్‌చారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

