రైతుల ఇక్కట్లు సీఎం చక్కర్లు
కాంట్రాక్టులు, విదేశీ పర్యటనలకు సమయం ఉంటుంది కానీ, పేదలకు భరోసా కల్పించడానికి సమయం లేదా? అసలు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయ కార్యాచరణ ఏది? మంత్రులు తుమ్మల, పొంగులేటి రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం కాదు.. ప్రభుత్వం ఏం చేయబోతున్నదో స్పష్టంగా చెప్పాలి. - హరీశ్‌రావు
- రాష్ట్రంలో కరువు పరిస్థితులను గాలికొదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడ్తున్న రేవంత్
- పంటలు ఎండిపోయి సబ్స్టేషన్లు, రోడ్లపై ధర్నా చేస్తుంటే ఏ మాత్రం పట్టదా?
- ఎల్‌నినో ప్రభావంపై శాస్త్రవేత్తలు, సంస్థలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర
- అధికారులతో వీసీ కూడా నిర్వహించలేని దౌర్భాగ్యపు కాంగ్రెస్ సర్కార్
- రైతుల పంటల సాగుకు నీళ్లు లేవు.. బీర్ల ఉత్పత్తికి మాత్రం నీళ్లు ఇస్తరటా..?
- జూరాల నుంచి నీళ్లు తీసుకున్నారని రైతులపై కేసులు పెట్టిన సర్కార్
- బీర్లకు నీళ్లు ఇస్తున్న వారిపై పోలీసులు కేసులెందుకు పెట్టరు?
- సర్కార్ పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ మండిపాటు
సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది.. రాష్ట్రంలోని రైతులందరూ సోమవారం ఉద యం 11గంటలకు గ్రామాల్లోని రైతు వేదికలకు రావాలని ఆదివారం మెస్సేజ్‌లు పంపారు. రాత్రి 12గంటలకు ఎమ్మెల్యేలకు, నాకు కూడా మెస్సేజ్ చేశారు. కానీ సోమవారం ఉదయం 9.52 గంటలకోసారి, 11గంటలకు అని మరోసారి చెప్పి రెండు సార్లు రద్దు చేశారు. తీరా మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రారు, కానీ డిప్యూటీ సీఎం వస్తారని చెప్పారు. రైతులంటే పిల్లల ఆటలా ఉన్నదా? ప్రభుత్వానికి అసలు బాధ్యత ఉన్నదా?
– హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : సాగునీరు, కరెంట్ అందక పంటలు ఎండిపోయి రైతులు సబ్స్టేషన్ల వద్ద, రోడ్లపై ఆందోళనలు చేస్తుంటే వారికి భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. అసలు రైతులంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యతలేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఎల్‌నినో ప్రభావంపై తొమ్మిది నెలలుగా ప్రపంచ శాస్త్రవేత్తలు, భారత ప్రభుత్వ సంస్థలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని దుయ్యబట్టారు.
వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు పరిష్కారం చూపడంలోనూ సర్కార్ సీరియస్‌గా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో సోమవారం పార్టీ నేతలతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు, ఎల్‌నినో పరిస్థితులుంటే పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూరాల నుంచి నీళ్లు తీసుకున్నారని రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టిన ప్రభుత్వం.. బీర్ల ఉత్పత్తికి నీళ్లు ఇస్తున్న వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి బాధ్యత లేదా?
‘మొన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం ఉంటుందని పొంగులేటి చెప్పారు. సీరియస్‌గా మాట్లాడతాం అన్నారు. కానీ, నిన్న ముఖ్యమంత్రి గోవా వెళ్లారు. మంత్రులు ఢిల్లీ వెళ్లారు. పొంగులేటి మాటలు తుస్సు అయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు రైతులందరూ రావాలని పిలిచారు. ఆ తర్వాత టెక్నికల్ సెషన్ అన్నారు. ఆ తర్వాత సీఎస్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం మాట్లాడుతారని చెప్పారు. ఇంత తీవ్రమైన సమస్యపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఇదేనా? క్యాబినెట్ సమావేశం లేదు.. వీడియో కాన్ఫరెన్స్ కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి. రైతులన్నా, రాష్ట్రమన్నా ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో అర్థమవుతున్నది’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
పంటలు వేయకుంటే రైతులెలా బతకాలి?
పంటలు వేయొద్దంటూ లీకులు ఇప్పించి వార్తలు రాయిస్తున్నారని, రైతులు పంటలు వేయకపోతే ఎలా బతకాలని హరీశ్‌రావు నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వలసపోయిన కూలీలు సొంతూళ్లకు తిరిగి వచ్చారని, కాంగ్రెస్ పాలనలో వారు మళ్లీ వలసపోయే పరిస్థితి దాపురించిందని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.
పార్టీ ప్రయోజనాలే ముఖ్యమా?
క్యాబినెట్ సమావేశం నిర్వహించి పంట సాగు విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేరా? రైతుల సమస్యల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఢిల్లీకి వెళ్తారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం ఢిల్లీలో ఉంటే కనీసం వీడియో కాన్ఫరెన్స్ లోనైనా పాల్గొనలేరా? అని నిలదీశారు. రైతులకు భద్రత, భరోసా కల్పించాల్సిన ఈ ప్రభుత్వం వారిని భయపెడుతున్నదని, ఈ రెండు బాధ్యతల్లోనూ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బొగ్గు కొరతకు, విద్యుత్తు కోతలకు కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. బొగ్గు కొరతకు ఎల్‌నినోకు సంబంధం ఏమిటి? నైని బొగ్గును తీసుకొచ్చి ముందుగానే నిల్వలు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? అని ప్రశ్నించారు.
పాలమూరు ద్రోహి రేవంత్
ఇక్కడ నీళ్లున్నా మోటర్లు నడుపలేని రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు కోసం మాత్రం 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి కృష్ణా జలాలను తరలిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. పాలమూరు ప్రజలకు నీళ్లు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే రేవంత్‌రెడ్డి పాలమూరు ద్రోహిగా మిగిలిపోతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ట్రయల్ రన్ చేసిన ప్రాజెక్టుల రిజర్వాయర్లను మూడేండ్లయినా ఎందుకు నింపలేకపోతున్నారని ప్రశ్నించారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. కల్వకుర్తిలో ఐదు మోటర్లను 24గంటలు నడిపితే పాలమూరులో సగం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చని చెప్పారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు నీటిని అం దించే కీలకమైన సింగూరు ప్రాజెక్టు ఖాళీగా ఉన్నదని మండిపడ్డారు. మరమ్మతులు చేయడంలో ఎందుకు విఫలమయ్యారు? బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
నీటి దుర్వినియోగంపై చర్యలేవి?
ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు జూరాల గేట్లు తెరిచిన 14మంది రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని హరీశ్‌రావు విమర్శించారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు?’ అని నిలదీశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజయ్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజు, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గురుకుల కాంట్రాక్టుల్లో 20% కమీషన్లు
- సిట్ లేదా విజిలెన్స్ విచారణకు హరీశ్‌రావు డిమాండ్
గురుకుల పాఠశాలల కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురుకులాలకు సంబంధించిన వివిధ పనుల్లో 20% కమీషన్ల దందా నడుస్తున్నదని విమర్శించారు. ఈ అవినీతి బాగోతంపై సీఎం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురుకుల కాంట్రాక్టుల్లో జరుగుతున్న 20% కమీషన్లపై విజిలెన్స్ విచారణో లేదా సిట్ విచారణో ఎందుకు వేయ డం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను తేల్చకపోతే, గా ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నదన్న అనుమానాలు బలపడుతాయని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

