Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి లాగా తమకు పార్టీ మారిన చరిత్ర లేదని, పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర మాది అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.
పదవులను గడ్డి పోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ఉంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది. మేం ఏదో పదవుల కోసం పాకులాడినం అన్నట్టు సీఎం మాట్లాడడం సరికాదు. ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఏబీవీపీలో షురువైండు.. టీఆర్ఎస్లో పని చేసిండు, తెలుగుదేశంలో పోయిండు, కాంగ్రెస్‌లో పోయిండు.. మరి రేపు యేడ ఉంటడో. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి.. కానీ మాకు అట్లాంటిది ఏం లేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.