పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
నాడు కేసీఆర్ వలసలను వాపస్ తెస్తే.. మళ్లీ వలసల పాల్జేసిన రేవంత్‌రెడ్డి.. కర్ణాటకలో పాలమూరు వలస కూలీల దుర్మరణం.. 10 లక్షల చొప్పున ఇవ్వాలి
మహబూబ్‌నగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాకు రేవంత్‌రెడ్డి రూపంలో గ్రహణం పట్టిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నీళ్లు ఎత్తకపోవడం, కరెంట్ ఇవ్వకపోవడంతో మళ్లీ పాలమూరుకు ఈ రేవంత్ సర్కార్ కరువును తెచ్చి పెట్టిందని విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు కట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వలసలను వాపస్ తెచ్చారని చెప్పారు. కానీ, అసమర్థ విధానాలతో సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలను మళ్లీ వలసల పాలు చేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. చెప్పినట్టే పాత వ లసల రోజులు తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు.
గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో దాదాపు 40 దళిత కుటుంబాలు పొట్టచేత పట్టుకొని కూలిపనుల కోసం పక్క రాష్ట్రమైన కర్ణాటకకు వలస వెళ్లడమే అందుకు నిదర్శనమని గుర్తుచేశారు. వారు ఘోర ప్రమాదానికి గురవగా, వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ మేరకు బుధవారం ఇందువాసి గ్రామానికి వెళ్లిన హరీశ్‌రావు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో తాను ఇక్కడికి వచ్చానని చెప్తూ, మృతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. గాయపడిన వారికీ తక్షణసాయంగా అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలి
ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున మెరుగైన పూర్తి ఉచిత వైద్యం అందిస్తూనే తగిన ఆర్థికసాయం అందించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాకు చెందిన పేద దళిత కుటుంబాలు పక్క రాష్ర్టానికి వలసపోయి ఇంత ఘోర ప్రమాదానికి గురైతే, ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ గానీ, ప్రభుత్వం గానీ కనీసం స్పందించలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు సర్కార్ నుంచి నయాపైసా ఆర్థిక సాయం అందలేదని, సరైన వైద్యం అందక, చేతిలో డబ్బులేక దవాఖానల్లో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎంకు సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇదే జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా, ఏ ఒక్క మంత్రి కూడా బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పారు.
ఒక్క ఎకరాకూ నీరివ్వని రేవంత్ సర్కార్
రేవంత్ ప్రభుత్వం వచ్చినంక పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరానికైనా కొత్తగా సాగునీరు ఇచ్చారా? ఒక్క చెక్‌డ్యామ్ కట్టారా? ఒక్క చెరువునైనా బాగుచేశారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో 24 గంటలు నడుపాల్సిన మోటర్లను 8-9 గంటలే నడిపి నీళ్లు ఎత్తకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి జనం వలసబాట పట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను, వాటి మోటర్లను కూడా నడుపడం కాంగ్రెస్‌కు చేతకావడం లేదని మండిపడ్డారు.
గట్టు సబ్‌స్టేషన్, ఎండిన పొలాల పరిశీలన
గట్టు మండల కేంద్రంలోని 33 కేవీ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. రైతులతో కలిసి ఆయన సబ్‌స్టేషన్‌లో లాగ్ బుక్‌లను పరిశీలించి విద్యుత్తు సరఫరా వేళలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గట్టు మండలంలోని నెట్టెంపాడు ప్రాజెక్టు కింద నీటిని విడుదల చేయకపోవడంతో ఎండిన పంట పొలాలను హరీశ్‌రావు పరిశీలించారు. ఏపుగా పెరిగిన వరి నీళ్లు లేక ఎండిపోయిందని, సర్కార్ సక్రమంగా నీళ్లిచ్చి ఉంటే పంట చేతికొచ్చేదని ఈ సందర్భంగా హరీశ్‌రావుతో రైతులు ఏకరువు పెట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలో చెక్‌డ్యామ్‌లు కూల్చివేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని హరీశ్‌రావు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.
కొడంగల్ రైతులకు బేడీలు వేసిన సీఎం: హరీశ్
రేవంత్‌రెడ్డి సొంత గడ్డకే తీరని ద్రోహం చేసిన పాలమూరు ద్రోహి అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో భూములు ఇవ్వమన్న రైతుల చేతులకు బేడీలు వేయించాడని, మక్తల్‌లో పంట ఎండిపోతున్నదని జూరాల నుంచి సాగునీరు అడిగినందుకు 14 మంది రైతులపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టించాడని విమర్శించారు. కండ్లముందు నీళ్లున్నా పంటకు ఇవ్వకపోతే నిలదీసిన రైతులపై అక్రమ కేసులు పెట్టడమేనా సొంత జిల్లాకు రేవంత్ ఇచ్చే బహుమానం? పాలమూరు ప్రజలకు కన్నీళ్లు, కరువు, వలసలు, రైతులకు బేడీలు, నాన్-బెయిలబుల్ కేసులే కాంగ్రెస్ ఇచ్చిన కానుకలా? అంటూ విమర్శించారు.
కేసీఆర్ పోరాడి కృష్ణా జలాల ట్రిబ్యునల్ సాధిస్తే, మూడేండ్లు గడిచినా ట్రిబ్యునల్ ముందు సమర్థంగా వాదనలు వినిపించడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హన్మంతునాయుడు, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇంతియాజ్ ఇసాక్, బీఎస్ కేశవ్, రాఘవేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్, నాగర్‌దొడ్డి వెంకటరాములు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

