కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 29 : కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన గొట్టిముక్కల వెంగళరావును బీఆర్ఎస్ ఆహ్వానించింది. ఆదివారం వెంగళరావు నివాసానికి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ వెళ్లి పార్టీలోకి స్వాగతించారు. 40 ఏండ్లుగా కాంగ్రె స్లో ఉన్నా గుర్తింపు ఇవ్వలేదని వెంగళరావు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో చేరితే అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎమ్మె ల్సీ, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. దీంతో ఆ యన సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.