పాడిరంగం అభివృద్ధిపై నివేదిక ఇవ్వండి

- విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయానికి నూతన ఔట్లెట్లు
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పాడిరంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రెండోవిడత గొర్రెల పంపిణీలో వేగం పెంచాలని, డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ఆదేశించారు. యాంటీరేబిస్ వ్యాక్సిన్ కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సరఫరా చేయాలని చెప్పారు. గొర్రెలకు ఏడాదిలో మూడుసార్లు నట్టల నివారణ మందు వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు చేరువచేసేందుకు నూతన ఔట్లెట్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే సంచార పశువైద్యశాలలు స్పందించేలా చూడాలన్నారు. నిబంధన ప్రకారం ఉన్న చేప పిల్లలను మాత్రమే విడుదలచేయాలని మత్స్య శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, షీప్ ఫెడరేషన్ ఎండీ రాంచందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

