గడువులోగా పోలీస్ భవనాల నిర్మాణం
- అధికారులకు హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశం

హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): పోలీస్ కార్యాలయ భవనాల నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలని హోం మంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన పోలీస్ శాఖకు చెందిన భవనాల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంచార్జి ఎండీ సంజయ్‌కుమార్ జైన్, కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్, ఎస్ఈ తులసీధర్ తదితరులు ఈ సమీక్షలో భవన నిర్మాణాల పురోగతిని హోం మంత్రికి వివరించారు. సిద్దిపేట కమిషనర్ కార్యాలయం, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. సిరిసిల్ల, సూర్యాపేట, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, భూపాలపల్లి, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల పోలీస్ కార్యాలయాలతోపాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ భవనం నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో కాచిగూడ, మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల భవనాలు సిద్ధంగా ఉన్నాయని, ఎస్ఆర్ నగర్, ఆసిఫ్‌నగర్, చాంద్రాయణగుట్ట, కాచిగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ భవనాలు త్వరలో పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ.. పోలీస్ కార్యాలయాలు, స్టేషన్ల భవనాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత మెరుగ్గా భద్రత కల్పించే అవకాశం ఉంటుందన్నారు. నేర నియంత్రణకు పోలీస్ సిబ్బంది మరింత పకడ్బందీగా చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

