Arekapudi Gandhi | అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు.. సోదరుడు, కుమారుడిపై కూడా..
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై (Arekapudi Gandhi) హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్‌రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. గాంధీ సోదరుడు, కుమారుడు పృథ్వీతోపాటు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్‌లను నిందితులుగా చేర్చారు.
హైదరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై (Arekapudi Gandhi) హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్‌రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. గాంధీ సోదరుడు, కుమారుడు పృథ్వీతోపాటు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్‌లను నిందితులుగా చేర్చారు.
ఈ నెల 12న కౌశిక్‌రెడ్డి నివాసంపై అరికెపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు అంటూ ఇంటికే పరిమితం చేసిన పోలీసులు.. కూకట్పల్లి నుంచి కొండాపూర్ దాక 9 కిలోమీటర్లు మందీమార్బలంతో అరికెపూడి బయల్దేరినా పోలీసులు చూడనట్టే ఉండిపోయారు. భారీ కాన్వాయ్‌తో కౌశిక్ ఇంటికి చేరిన గాంధీ.. తన అరుచరులతో కలిసి ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. టమాటాలు, గుడ్లు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ఇంటి అద్దాలు పగులగొట్టారు. పూల కుండీలను ధ్వంసం చేశారు.
కాగా, ఇదే వ్యవహారంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహా 15 మంది ఆయన అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఇప్పటికే రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. కౌశిక్‌రెడ్డితోపాటు గచ్చిబౌలి పోలీసులు సైతం ఎమ్మెల్యే గాంధీ, అతడి అనుచరులపై ఫిర్యాదులు చేయడంతో ఈ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దాడి, హత్యాయత్నం చేసినట్టు కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, తమ విధులకు ఆటంకం కలిగించినట్టు గచ్చిబౌలి ఎస్ఐ మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రెండు వేర్వేరు ఫిర్యాదులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే గాంధీ సహా 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతోపాటు అతడి అనుచరులు ఉప్పలపాటి శ్రీకాంత్, బీ గౌతమ్‌గౌడ్, రాంపల్లి వెంకటేశ్, జీ రాములు, నరేశ్, మేల శివ, రాధిక, మంజుల, చంద్రికగౌడ్, రంగం నాగేందర్‌యాదవ్, డీ వెంకటేశ్ గౌడ్, అశ్రఫ్, రఘునాథ్‌రెడ్డి, మోహన్‌గౌడ్ తదితరులపై 109(1), 189, 191(2), 191(3), 132, 329, 333, 324(4), 324(5), 351(2), రెడ్‌విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు.
తమ విధులకు ఆటంకం కలిగించారంటూ గచ్చిబౌలి ఎస్ఐ మహేశ్‌కుమార్‌గౌడ్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే గాంధీ సహా 15 మందిపై 189, 191(2),191(3), 61, 132, 329,333, 324(4), 324(5), 351(2) రెడ్‌విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో దాడికి పాల్పడిన గాంధీ, అతడి అనుచరులపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

