హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గురుకుల టీచర్ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ కే అలోక్‌కుమార్ తెలిపారు. డిగ్రీ, బీఎడ్‌లో 60 శాతంపైగా మార్కులు సాధించిన బీసీ ఏ, బీ, డీ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని వెల్లడించారు.
అభ్యర్థులు తార్నాక ఓయూ టీఎస్ స్టడీ సర్కిల్లో కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040-24071178, 040-27077929ని సంప్రదించాలని పేర్కొన్నారు.