fox | మహబూబాబాద్ రూరల్ : వ్యవసాయ బావిలో పడిన నక్కను జంతు ప్రేమికురాలు, నేను సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు సుమ కాపాడింది. మహబూబాబాద్ మండల పరిధిలోని గడ్డిగూడెం తండాకు చెందిన భూక్య విష్ణు అనే రైతు వ్యవసాయ బావిలో ఆదివారం రాత్రి నక్క ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దాన్ని గమనించిన రైతు నక్కను కాపాడేందుకు గ్రామపంచాయతీ, అటవీ శాఖ, అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు సకాలంలో రాకపోవడంతో నేను సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు సుమకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆమె వెంటనే బావి వద్దకు చేరుకొని కొంతమంది రైతుల సహకారంతో బావిలో పడ్డ నక్కను తీసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సుమను గడ్డిగూడెం గ్రామవాసులు సుమను అభినందించారు.