చెరువులో మునిగి నలుగురు మృతి

- కర్ణాటకలోని గోడ్వాడీ షరీఫ్ దర్గా వద్ద ఘటన
- మృతులంతా హైదరాబాద్ వాసులు
- రహ్మత్‌నగర్ డివిజన్లోని విషాదఛాయలు
- మరో రెండు చోట్ల ముగ్గురు గల్లంతు
బంజారాహిల్స్, అక్టోబర్ 3: దైవదర్శనానికి వెళ్లిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని దర్గాకు చేరుకున్న వీరు పక్కనే ఉన్న చెరువులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. వీరిలో ఒక యువకుడు, ముగ్గురు బాలురు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్ డివిజన్‌కు చెందిన వారు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా.. హైదరాబాద్ రహ్మత్‌నగర్ డివిజన్లోని సలీంబాబానగర్ బస్తీకి చెందిన జునాయిద్ ఖాన్(21) ఫ్లవర్ డెకరేషన్ పనులు చేస్తుంటాడు. అతడి సోదరుడు ఫహాద్‌ఖాన్(16) పదోతరగతి చదువుతున్నాడు. అదే బస్తీలో నివాసం ఉంటున్న సయ్యద్ జునైద్(16), కిషన్‌బాగ్ సమీపంలోని హసన్‌నగర్ చింతల్‌మెట్‌కు చెందిన హైదర్‌ఖాన్(16) కలిసి ఆదివారం ఉదయం 11 గంటలకు కర్ణాటకలోని బీదర్ సమీపంలో గల గోడ్వాడీ షరీఫ్ దర్గాకు చేరుకున్నారు. వీరు పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో హైదర్‌ఖాన్ నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు జునాయిద్ ఖాన్‌తోపాటు మిగిలిన వారు చెరువులోకి దూకారు. వారిలో ఎవరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న హుమ్మాబాద్ పోలీసులు హైదరాఖాన్ మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు 4 గంటలపాటు ప్రయత్నించిన తర్వాత మిగిలిన ముగ్గురి మృతదేహాలను కూడా బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో సలీంబాబానగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరో రెండు ఘటనల్లో ముగ్గురు గల్లంతు
నందిపేట్/మునిపల్లి/పుల్కల్ రూరల్, అక్టోబర్ 3: నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో కిరాణా దుకాణం నడుపుతున్న యువకులు ఆదివారం సరదాగా ఉమ్మెడ వంతెన వద్దకు వెళ్లారు. కొద్దిసేపు ఒడ్డునే కూర్చున్న వీరు నీటిలోకి దిగారు. కొద్దిగా ముందుకు వెళ్లిన కేతురామ్ (30), హీరారామ్ (26), జాన్తారామ్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. మిగతా వారు అరుపులు, కేకలు వేయగా పక్కనే ఉన్న ఉమ్మెడకు చెందిన యువకులు పరుగున వచ్చి జాన్తారామ్ను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అందరూ చూస్తుండగానే కేతురామ్, హీరా రామ్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కాగా సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు వద్ద ఇద్దరు సోదరులు తైయిఫ్(20), సోహెల్(27) సెల్ఫీ దిగుతున్న క్రమంలో తమ్ముడు తైయిఫ్ కాలు జారి పడిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకు సోహెల్ నీటిలోకి దిగడంతో కొట్టుకుపోయాడు. అయితే తైయిఫ్ ప్రాజెక్టు గేట్ల ముందు భాగంలో ఉన్న సిమెంట్ గద్దెను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. సోహెల్ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- tank
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

