కరువు మండలాల ప్రకటనలోనూ రాజకీయమా?
రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో మొత్తం పంటలు ఎండిపోయి రైతులుఅల్లాడుతుంటే, ప్రభు త్వం కరువు మండలాల ప్రకటనలోనూ రాజకీయం చేస్తున్నదని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు.
- మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫైర్
అల్లాదుర్గం, అక్టోబర్ 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువుతో మొత్తం పంటలు ఎండిపోయి రైతులు
అల్లాడుతుంటే, ప్రభు త్వం కరువు మండలాల ప్రకటనలోనూ రాజకీయం చేస్తున్నదని సంగారెడ్డి జిల్లా
అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు. శుక్రవారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం
ముస్లాపూర్, బహిరన్‌దిబ్బ గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన
మీడియాతో మాట్లాడుతూ.. కరువు మండలాల ప్రకటనలో ఉమ్మడి మెదక్ జిల్లాపై వివక్ష చూపించారని
విమర్శించారు.
అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మండలాల్లో పంటలు చేతికి రాలేదని, మొత్తం పంటలు ఎండిపోయాయని, పత్తి దిగుమతి కూడా తక్కువగా వచ్చిందని అన్నారు. ఈ మూడు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుబంధు కోసం నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడం సరికాదని అన్నారు. ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి పంటల నష్టాన్ని అంచనా వేసి కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

