Harish Rao | ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే పెదవాగుకు గండి.. నష్టపోయిన రైతన్నను ఆదుకోవాలి: హరీశ్‌రావు
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెదవాగు ప్రాజెక్టు గండిపడి, కట్టకొట్టుకుపోయిన ఘటనపై మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే పెదవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మండిపడ్డారు.
- సకాలంలో గేట్లు తెరిస్తే ప్రమాదం తప్పేది
- ఘటనపై విచారణ జరపాలి
Harish Rao | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెదవాగు ప్రాజెక్టు గండిపడి, కట్టకొట్టుకుపోయిన ఘటనపై మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే పెదవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మండిపడ్డారు. రైతులు హెచ్చరించినప్పుడే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయి గేట్లు తెరిచి ఉంటే రూ.వంద కోట్ల నష్టం జరిగేది కాదని అన్నారు. కట్టమీద నుంచి నాలుగైదు గంటల పాటు నీళ్లు పొంగిపొర్లుతుంటే గేట్లు ఎత్తకుండా అధికారులు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. మూడు గేట్లుంటే, రెండు గేట్లే ఎత్తడంలో ఆంతర్యం ఏమిటి? అని అన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు బద్దలై గుమ్మడివల్లి గ్రామాన్ని ముంచేసి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించి వందల మంది గిరిజన బిడ్డల ప్రాణాలు ఫణంగా పెట్టారని తెలిపారు. పెదవాగు ప్రాజెక్టు తెలంగాణ భూ భాగంలోనే ఉన్నదని, పర్యవేక్షణ చేస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదలశాఖ అధికారులేనని వెల్లడించారు. ప్రాజెక్టుకు గండి పడటం వల్ల గుమ్మడివల్లి, రంగాపురం, కోయరంగాపురం, బుచ్చువారిగూడెం, నారాయణపురం గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులుండీ ఏం లాభం?
పెదవాగు ప్రాజెక్టు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని హరీశ్‌రావు విమర్శించారు. రక్షించాలని అధికారులకు ఫోన్ చేసినా కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఏపీ నుంచి హెలికాప్టర్లు సరైన కాలంలో రాకుంటే ఆరోజు వరదలో చికుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు దారుణమని మండిపడ్డారు. ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా? అని ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒరగబెట్టింది ఏమిటి? అని నిలదీశారు.
రైతులను ఆదుకోవాలి
ఇసుకమేట వేసిన ప్రతి ఎకరాకు రూ.25 వేలు, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలన్నారు. పశువులు కోల్పోయిన రైతులకు ప్రకృతి వైపరీత్యనిధి నుంచి వెంటనే సహాయం చేయాలని వెల్లడించారు. ఘటనపై కారణాలు గుర్తించేందుకు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

