పోడు సాగుకు అటవీ శాఖ బ్రేక్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం దేవుడ్పల్లి బీట్ పరిధిలోని సుర్దాపూర్ శివారులో పోడు భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనపర్చుకున్నారు.
- రైతుల భూములు స్వాధీనం చేసుకొని అధికారుల తవ్వకాలు
- సుర్దాపూర్ శివారు ప్రాతంలో రైతులను అడ్డుకున్న పోలీసులు
కెరమెరి, జూలై 4 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం దేవుడ్పల్లి బీట్ పరిధిలోని సుర్దాపూర్ శివారులో పోడు భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనపర్చుకున్నారు. పోడు భూముల్లో రైతులు సాగు చేయకుండా శనివారం జేసీబీతో తవ్వకాలు ప్రారంభించారు. ఉదయం నుంచి చినుకులు కురుస్తున్న సమయంలో అటవీ శాఖ చేపట్టిన తవ్వకాల విషయం తెలుసుకున్న పోడు రైతులు ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే పోలీసులు భారీగా మోహరించి రైతులు అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.
దీంతో ఆ ప్రాంతంలో అధికారులు, పోడు రైతుల మధ్య స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తరతరాల నుంచి భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, తమ బతుకులు నాశనం చేయొద్దని వేడుకున్నారు. కెరమెరి ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ మాట్లాడుతూ.. ప్రధాన రహదారి పక్కన గల భూములతోపాటు దాదాపు 150 ఎకరాల పోడు భూములను అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు. అనుమతులు లేకుండా అటవీ భూములను సాగు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, ఇదే కా కుండా మరికొన్ని భూములను సైతం స్వాధీ నం చేసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

