Congress | జై బాపూ.. హింసే మా ఆయుధం.. కాంగ్రెస్కు వ్యతిరేకంగా గాంధీభవన్ వద్ద వెలసిన ఫ్లెక్సీలు
కాంగ్రెస్ (Congress) పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యట నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. జై బాపు.. హింసే మా ఆయుధం, జై భీం.. ఎస్సీ, ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్.. రాజ్యంగం అంటే మాకు లెక్కే లేదు.. వంటి స్లోగన్లతో..
హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యట నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. జై బాపు.. హింసే మా ఆయుధం, జై భీం.. ఎస్సీ, ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్.. రాజ్యంగం అంటే మాకు లెక్కే లేదు.. వంటి స్లోగన్లతో కూడిన ఫ్లెక్సీలు, పోస్టర్లను గాంధీ భవన్తోపాటు ఎల్బీ స్టేడియం, సోమాజిగూడ, నగరంలోని పలు చోట్ల గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు.

దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది, ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ వాటిలో పేర్కొన్నారు. ఈ పోస్టర్లు, ఫెక్సీలు వాహనదారులను విశేషంగా ఆకర్షించాయి. వాహనాలు ఆపి మరీ వాటిని చదివారు. పలువురు వాటిని తమ సెల్ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి.
కాగా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎల్బీ స్టేడియంలోనిర్వహించబోయే సామాజిక న్యాయ సమర భేరి సభకు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

