ఇండ్లపై జెండా.. నిబంధనలు ఇవే
స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట ప్రతీఇంటా మువ్వన్నెల జెండాను రెపరెపలాడించడానికి జాతి ప్రజలు ఎంతో ఉద్విగ్నులై ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు (ఫ్లాగ్ కోడ్) తెలుసుకుందాం..
జెండా తయారీకి ఏ వస్ర్తాన్ని వాడాలి?
పాలిస్టర్, కాటన్, ఉన్ని, సిల్క్, ఖాదీతో చేసిన వస్ర్తాన్ని వాడాలి. చేతితో గానీ మెషిన్‌తో గానీ జెండాను తయారుచేయవచ్చు.
జెండాను ఎక్కడ ప్రదర్శించాలి?
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు అన్ని విద్యాసంస్థలు అన్ని రోజుల్లో జెండాను ఎగురవేయవచ్చు. వజ్రోత్సవాల్లో భాగంగా ఇండ్ల మీద ఈ నెల 13, 14, 15 తేదీల్లో పతాకాన్ని ఎగురవేయడానికి ప్రత్యేక అనుమతి ఉన్నది.
ఏ సమయాల్లో జెండా ఎగురవేయాలి?
గతంలో సూర్యోదయం, సూర్యాస్తమం మధ్య మాత్రమే జెండాను ఎగురనీయనిచ్చేవారు. అయితే గత నెల 20న చేసిన కొత్త సవరణ ప్రకారం.. రాత్రిళ్లు కూడా జెండాను ఎగురనీయవచ్చు.
జెండా పరిమాణం, నిష్పత్తి ఎంత ఉండాలి?
జెండా సైజు ఎంత ఉన్నప్పటికీ, పతాకం రూపు మాత్రం దీర్ఘచతురస్రాకారంలోనే ఉండాలి. పొడవు వెడల్పు నిష్పత్తి 3:2

జెండాను ఎలా ప్రదర్శించాలి?
కాషాయం రంగు ఎప్పుడూ పైన ఉండేలా జెండాను ఎగురవేయాలి. ఇతర పార్టీ జెండాలు జాతీయ పతాకం కంటే ఎత్తులో ఉండకుండా చూసుకోవాలి. కాలిన, రంగువెలిసిపోయిన, చిరిగిన పతాకాన్ని ఎగురవేయవద్దు.
వాహనాలపై జెండాను పౌరులు పెట్టుకోవచ్చా?
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు మాత్రమే వాహనాలపై జెండాను పెట్టుకోవాలి.
పాడైన పతాకాన్ని ఏం చేయాలి?
జాతీయ పతాకం చిరిగిపోవడం, కొంచం కాలిపోవడం గనుక జరిగితే.. ఎవరూ లేని ప్రైవేట్ ప్రాంతంలో పతాకం గౌరవానికి భంగం కలుగనీయకుండా కాల్చివేయాలి. పేపర్ జెండాలు చిరిగిపోతే.. వాటిని కూడా ఇలాగే చేయాలి. కాల్చేప్పుడు వీడియోలు తీయడం, ప్రచారం చేయడం నేరం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- har ghar tiranga
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!


