మీ ఇల్లే మినీ థియేటర్!

- ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటీటీ విప్లవం
- కొత్త సినిమాల జోరు.. వెబ్‌సిరీస్‌ల హోరు
- 80% హైదరాబాదీలు ఓటీటీ ఖాతాదారులే
- వరుసగా సూపర్‌హిట్ సినిమాలు విడుదల
- తెలుగు కంటెంట్‌కు పెరుగుతున్న స్పందన
- కోట్లల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్న సంస్థలు
కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే ఒకప్పుడు థియేటర్ల ముందు గంటల తరబడి లైన్లలో నిల్చొనేది.. బ్లాక్‌లో టికెట్లు కొనేది.. కుటుంబమంతా కలిసి వెళ్లాలంటే ప్రత్యేకంగా సమయం కేటాయించేది.. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో అని ప్లాన్ చేసుకొనేది. ఇప్పుడా సమస్యలే లేకుండా పోయాయి. ఓటీటీ పుణ్యమా అని ఇల్లే థియేటర్లా మారిపోయింది. ఎవరికి నచ్చిన టైంలో వాళ్లు, ఎవరికి నచ్చిన సినిమా వాళ్లు చూసుకొనే సదుపాయం కలిగింది.
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 ( నమస్తే తెలంగాణ ): ఓవర్ ది టాప్.. ఓటీటీ. కూర్చున్న చోటే కావాల్సిన సినిమా, వెబ్‌సిరీస్, డాక్యుమెంటరీలు ఇంటర్నెట్ ద్వారా చూసుకొనేలా చేసిన మీడియా సర్వీస్. కరోనా వల్ల అనూహ్యంగా వృద్ధి చెందిన రంగం ఏదన్నా ఉందంటే అది ఓటీటీనే. లాక్డౌన్ సమయంలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించి తన స్థానాన్ని టాప్ ప్లేస్‌లో నిలుపుకొన్నదిది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకొని సినిమాలు విడుదలవుతున్నా, తన హవాను కొనసాగిస్తున్నది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ, హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్ వినియోగదారులకు కొత్త కంటెంట్‌ను అందిస్తూ, రోజురోజుకు సబ్‌స్ర్కైబర్లను పెంచుకొంటున్నాయి. మొదట్లో ఉద్యోగులు, టెక్నాలజీపై అవగాహన ఉన్నోళ్లే ఓటీటీని ఎక్కువగా వినియోగించేవాళ్లు. ఇప్పుడు అందరికి ఓటీటీపై అవగాహన వచ్చింది. కొత్త సినిమాలను విడుదల చేయటం కూడా ఓటీటీ మార్కెట్‌కు కలిసివస్తున్నది. హైదరాబాద్‌లో ఓటీటీ కంటెంట్‌ను చూస్తున్న వారి సంఖ్య దాదాపు 80 శాతంగా ఉన్నదని సినీనిపుణులు చెప్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఓటీటీని ఎక్కువగా ఆదరిస్తున్నారని అంటున్నారు. వారి ఆసక్తిని గమనించి ప్రముఖ నటీనటులు కూడా ఓటీటీ సిరీస్‌లలో నటించేందుకు వెనుకాడటం లేదు. తెలుగులో వచ్చిన ‘ఆహా’ కొద్దిరోజుల్లోనే పది లక్షలకు పైగా డౌన్లోడ్లు సాధించింది. కరోనా సంక్షోభంలో ఒక విధంగా సినీ ఇండస్ట్రీని ఆదుకున్నది ఓటీటీనే. సినిమాలను ఓటీటీలో విడుదల చేయటం వల్లే నిర్మాతలకు నష్టాలు రాలేదు.
స్థానిక భాషల్లోకి ప్రవేశం
ఓటీటీ వేదికలు స్థానిక భాషల్లోకి రావటంతో కొత్త టాలెంట్‌కు భారీగా అవకాశాలు వస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సినీ పెద్దలు ఓటీటీ వ్యాపారంలోకి వచ్చేస్తున్నారు. అల్లు అరవింద్ తీసుకొచ్చిన ‘ఆహా’వేదికే ఇందుకు నిదర్శనం. కంటెంట్ డిమాండ్, తక్కువ ఇంటర్నెట్ చార్జీలు, పోర్టబిలిటీ ప్రాధాన్యత, స్థానిక భాషల్లో కంటెంట్ తదితర ప్రత్యేకతలతో ఓటీటీ మార్కెట్లో భారత్ దూసుకుపోతున్నదని సినీ నిపుణులు తెలిపారు. సరికొత్త సినిమాలు, ఎక్స్‌క్లూజివ్స్, సినీరంగంలోని ప్రముఖ వ్యక్తులతో కార్యక్రమాలు, ప్రేక్షకులకు నచ్చే సిరీస్‌లు ఇలా అన్నిరకాల కంటెంట్‌ను ఆవిష్కరించడానికి ఓటీటీ వేదిక ఉపయుక్తంగా ఉన్నదని అంటున్నారు.
ఓటీటీ ప్లాట్‌ఫాంలకు కోట్లలో ఆదాయం
ఇప్పటికే డిస్నీ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, నెట్‌ఫ్లెక్స్, నెక్స్ తదితర ప్లాట్‌ఫాంలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. హాట్‌స్టార్‌కు దేశంలో సుమారు 30 కోట్లకుపైగా యూజర్లు ఉండగా అందులో 8 కోట్ల మందికిపైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 20 లక్షలకు పైనే సబ్‌స్ర్కైబర్స్ ఉంటారు. అమెజాన్‌కు దేశంలో కోటి మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. పలు కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తూ, సబ్‌స్ర్కైబర్లను, మార్కెట్‌ను పెంచుకొంటున్నాయి.
అవకాశాలకు కొదవలేదు
ఓటీటీలతో చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. స్టోరీలో బలం ఉంటే దాన్ని సినిమాగా మలిచేందుకు అనేక వేదికలు పుట్టుకొచ్చాయి. సామాన్యులు సైతం తమ క్రియేటివిటీతో పాపులారిటీ సంపాదిస్తున్నారు. తక్కువ డబ్బుతో ఎక్కువ ఆదరణ వచ్చేది ఓటీటీలోనే. టీవీల్లో వచ్చే కార్యక్రమాలను కూడా ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. మిస్ అవుతున్నామనే బాధ లేదు. సినీబ్యాంక్లాగా ఓటీటీ నిలిచింది. ఇంటర్నెట్ ఉంటే చాలు ఎప్పుడైనా సినిమాలు చూడొచ్చు.
ప్రశాంతి, ఐటీ ఉద్యోగి
–ఇంట్లోనే, ఫ్యామిలీతో హ్యాపీగా..
ఓటీటీలో ఎన్నో సినిమాలు విభిన్న భాషల్లో లభిస్తున్నాయి. నచ్చిన భాషలో సినిమా చూసే అవకాశం కలుగుతున్నది. కొత్త సినిమాలు విడుదల కావటం లేదనే బాధ లేదు. రోజురోజుకు ఏదో ఒక ఓటీటీలో కొత్త కంటెంట్ వస్తున్నది. దాంతో ఓటీటీకి ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నాం. థియేటర్‌కు వెళ్లే పరిస్థితి ఉన్నా ఇంట్లో అయితే కుటంబం అంతా కలిసి నచ్చిన ఫుడ్‌ను ఆరగిస్తూ తిలకించొచ్చు.
–మధు, ఐటీ ఉద్యోగి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

