నెల్లికుదురు, ఏప్రిల్ 19 : ‘ఎమ్మెల్యే సార్.. మీ కాళ్లు మొక్కుతా.. మా ఊరికి రోడ్డు వేయించండి’ అంటూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం వాసి, ఫీల్డ్ అసిస్టెంట్ వంగాల సోమయ్య ఆదివారం ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ కాళ్లపై పడి వేడుకున్నాడు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను రోడ్డు కోసం వేడుకున్నాడు.
గత ప్రభుత్వం చివరలో రోడ్డు మంజూరు చేసిందని, కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి ఉన్న రోడ్డును ధ్వంసం చేసి పనులను మధ్యలో నిలిపేశాడని పేర్కొన్నాడు. రెండున్నరేండ్లుగా పూర్తి చేయకపోవడంతో రోడ్డు గుంతలమయమై 108 అంబులెన్స్ కూడా గ్రామంలోకి రాని దీనస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశాడు.