NIN | పులియబెట్టిన ఆహారంలో పుష్కలంగా పోషక విలువలు: ఎన్ఐఎన్
పులియబెట్టిన ఆహారంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని మరోమారు స్పష్టమైంది.
- ఆహారం ఎంత పులిస్తే అంత మంచిది
- మిల్లెట్లపై అధ్యయనంలో వెల్లడి
- వివరాలు వెల్లడించిన ఎన్ఐఎన్
NIN | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): పులియబెట్టిన ఆహారంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని మరోమారు స్పష్టమైంది. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన ఆహార పదార్థాలపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆహారానికి పెరుగు కలిపి, కలపకుండా రెండు వేర్వేరు అధ్యయనాలు చేయగా పోషకాల్లో వచ్చిన మార్పులను అధ్యనకారులు గుర్తించారు. నిజానికి మన పూర్వీకులు పులియబెట్టిన ఆహారపదార్థాలనే తరచూ తీసుకునేవారు. అందులో చద్దన్నం ఒకటి. రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు, పాలు, సరిపడా నీళ్లు పోసి ఉదయం దానిని అల్పాహారంగా తీసుకునేవారు. అలా తీసుకున్న వారికి ప్రొబయోటిక్స్తోపాటు శరీరానికి సరిపడా క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు అందేవి. జీవనశైలితోపాటు క్రమంగా ఈ అలవాట్లు కూడా మారిపోయాయి. చద్దన్నం స్థానంలో టిఫిన్లు వచ్చి చేరాయి. ప్రస్తుతం మిల్లెట్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మిల్లెట్లతో చేసిన ఆహారాన్ని పులియబెట్టడం వలన కలిగే రసాయనిక మార్పులను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు.
పెరిగిన మైక్రో న్యూట్రిషన్ల పరిమాణం
సజ్జలు, రాగులు, జొన్నపిండితో చేసిన ఆహారాన్ని శాస్త్రవేత్తలు పలు రకాలుగా పరిశీలించారు. వండిన, పెరుగుతో పులియబెట్టిన, పెరుగు లేకుండా పులియబెట్టిన, ఎక్కువ పెరుగు కలిపి పులియబెట్టిన ఆహార పదార్థాల్లోని పోషకాల మార్పులను పరిశీలించారు. వండిన ఆహారం కంటే పులియబెట్టిన ఆహారంలో ప్రొటీన్లతోపాటు మైక్రోన్యూట్రిషన్ల పరిమాణం పెరిగినట్టు గుర్తించారు. రాత్రంతా నిల్వ ఉంచిన ఆహారంలో ఐరన్, జింక్, సూక్ష్మ పోషకాలు కూడా గణనీయంగా పెరిగాయని, సులభంగా కరిగిపోయే పోషకాలు సాధారణంగా వండిన పదార్థాల కంటే పులిసిన దాంట్లోనే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. తృణధాన్యాలను సంప్రదాయక పద్ధతుల్లో వండుకోవడం మంచిదని, దీనివల్ల పోషకాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

