తండ్రీ కూతురు అనుమానాస్పద మృతి
అనుమానాస్పద స్థితిలో తండ్రి, పెద్ద కూతురు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన కనతాల రాము (32), రమ్య, పెద్దకుమార్తె దివ్య(5), చిన్న కుమార్తెతో కలిసి ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం సాయిబాబా ఆలయం సమీపంలో అద్దెకు ఉంటున్నారు.
- భార్య రమ్య, చిన్నకూతురు రితిక పరిస్థితి విషమం
- ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం
మామిళ్లగూడెం, ఏప్రిల్ 26 : అనుమానాస్పద స్థితిలో తండ్రి, పెద్ద కూతురు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన కనతాల రాము (32), రమ్య, పెద్దకుమార్తె దివ్య(5), చిన్న కుమార్తెతో కలిసి ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం సాయిబాబా ఆలయం సమీపంలో అద్దెకు ఉంటున్నారు. రాము ఓ ఆన్లైన్ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని బంధువులు పేర్కొంటున్నారు. రెండురోజులుగా ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులెవ్వరూ బయట కనిపించలేదు. ఆదివారం ఉదయం రమ్య, చిన్న కూతురు రితిక బయటకు వచ్చినట్టు స్థానికులు తెలిపారు.
సాయంత్రం వారు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతోపాటు మృతుడి బంధువులు వారి ఇంటిని పరిశీలించగా రాము, దివ్య విగత జీవులుగా రక్తపు మడుగులో పడిఉన్నారు. మృతదేహాలు కుళ్లే స్థితిలో ఉన్నాయి. వారికి సమీపంలోనే మృతుడి భార్య రమ్య అపస్మారకస్థితిలో ఉండగా, చిన్న కుమార్తె రితిక గాయాలతో పక్కనే బిక్క ముఖంతో ఉంది. గమనించిన స్థానికులు వెంటనే రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని రమ్య, రితికను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రాము, దివ్య మృతదేహాలను ఖమ్మం జిల్లా ప్రధాన దవాఖానకు తరలించారు. ఫోరెన్సిక్ బృందం నమూనాలను సేకరించారు. తండ్రీకూతురు ఇద్దరూ తీవ్రగాయాలతో మృతి చెందడంతోపాటు చిన్న కుమార్తెకు నుదిటిపై గాయంకావడంతో హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

