రైతుగర్జనతో ప్రభుత్వంపై ఒత్తిడి
రైతుగర్జనతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
- ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల ఆత్మహత్యలు
- మాజీ మంత్రి జోగు రామన్న
- ప్రజల దృష్టి మరల్చడానికే ముఖ్యమంత్రుల సమావేశం
- ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ ధ్వజం
- ఆదిలాబాద్‌లో రైతుగర్జన పోస్టర్ విడుదల
ఆదిలాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) రైతుగర్జనతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ విప్ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నాయకుడు భార్గవ్ దేశ్‌పాండేతో కలిసి రైతుగర్జన పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు గర్జనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుతారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, పంటల కొనుగోళ్లు వంటి పథకాల అమలుతో రైతులు సంతోషంగా గడిపారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు సాగు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నవంబర్ 1న నిర్వహించే రైతు గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలు, ప్రజల దృష్టి మరల్చడానికే బీజేపీ, కాంగ్రెస్ కలిసి వేసిన ఎత్తుగడనే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశామని ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 756 టీఎంసీల నీటిని వృథాగా కిందికి వదిలిందని మండిపడ్డారు.
కన్నెపల్లి వద్ద పంప్‌లు ఆన్ చేస్తే 37 లక్షల ఎకరాలకు నీటిని అందించే అవకాశం ఉండేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వట్టి సీమ వద్ద పంపులను ఆన్ చేసి వందల టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు తెలిపారు. కృష్ణా నుంచి 250 టీఎంసీ నీళ్లు కిందకి పోయాయని చెప్పారు. నార్లాపూర్, కల్వకుర్తి, జూరాల పంపులు ఆన్ చేయక నీటిని వృథాగా కిందికి వదిలివేశారని తెలిపారు. పంప్‌లు ఆన్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని కుట్రతో రేవంత్ రెడ్డి కోట్లాది మంది రైతులు ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. రైతుల్లో ధైర్యం కలిగించడానికి, మేమున్నామంటూ భరోసా ఇవ్వడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుగర్జనకు హాజరవుతున్నారని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

