అప్పులబాధతో రైతు ఆత్మహత్య
అప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలో ఆదివారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన సామకూరి వెంకన్న (51) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గతేడాది తనకున్న మూడు ఎకరాలతోపాటుగా అదే గ్రామంలో ఐదు ఎకరాలను కౌలు తీసుకొని మిర్చి పంట వేశాడు.
- మహబూబాబాద్ జిల్లాలో విషాదం
మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 6 : అప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలో ఆదివారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన సామకూరి వెంకన్న (51) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గతేడాది తనకున్న మూడు ఎకరాలతోపాటుగా అదే గ్రామంలో ఐదు ఎకరాలను కౌలు తీసుకొని మిర్చి పంట వేశాడు. పెట్టుబడి కోసం బ్యాంకులో రూ.ఐదు లక్షలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.ఆరు లక్షల అప్పు చేశాడు. మిర్చి తోటకు చీడపీడలు సోకి దిగుబడి రాలేదు.
ఈ ఏడాది రెండు ఎకరాల పొలం సాగుచేశాడు. పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ.14 లక్షలు అప్పు చేశాడు. పంట దిగుబడి రాక చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

