హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభు త్వం మరో రెండేండ్లు పొడిగించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అల్లం నారాయణ పదవీ కాలం జూన్ 30వ తేదీతో ముగిసింది. ఒకటి జూలై నుంచి 30 జూన్ 2024 వరకు ఆయన చైర్మన్ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా మరోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.