మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
Ex Minister Mohammed Fareeduddin Pass away | మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నేత మొహమ్మద్ ఫరీదుద్దీన్ (64) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం కిందటనే

హైదరాబాద్ : మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నేత మొహమ్మద్ ఫరీదుద్దీన్ (64) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఫరీదుద్దీన్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో 2004లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. సొంతగ్రామం హోతి (బి) గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి మైనారిటీ సంక్షేమ శాఖ, సహకార శాఖ మంత్రిగా వైఎస్ ప్రభుత్వంలో పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఫరీదుద్దీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

