వరికి ఇథనాల్ ఎనర్జీ

- వరి, నూకలు, మక్కలు, చెరుకుతో తయారీ
- రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన వరిపంట సాగు
- రైస్ మిల్లులకు అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్లు
- పెట్రోలియం ఉత్పత్తుల్లో 20% ఇథనాల్ మిక్సింగ్
- ఏటా 143 కోట్ల లీటర్ల ఉత్పత్తికి కంపెనీలు సిద్ధం
- రాష్ట్ర అవసరాల కంటే 100 కోట్ల లీటర్లు అదనం
- ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి ప్రభుత్వం ఏర్పాట్లు
- టన్ను నూకలతో 400 లీటర్లు
- టన్ను బియ్యంతో 450 లీటర్లు
- టన్ను మక్కలతో 380 లీటర్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఇథనాల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతోపాటు రాష్ట్ర అవసరాల కంటే అదనంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణలో వరి దిగుబడి అధికంగా ఉండడంతో ఏటా 143 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. మరోవైపు రైస్ మిల్లులకు అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మన రాష్ట్ర అవసరాల కంటే అదనంగా 100 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా బియ్యం, నూకలకు మంచి గిరాకీ ఏర్పడే అవకాశమున్నది. టన్ను నూకలతో దాదాపు 400 లీటర్లు, టన్ను బియ్యంతో 450 లీటర్లు, టన్ను మొక్కజొన్నలతో 380 లీటర్ల ఇథనాల్‌ను తయారు చేయవచ్చు. ముడిచమురు దిగుమతులను, కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో 20% ఇథనాల్‌ను కలపాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. దీనిలో భాగంగా ప్రస్తుతం 10% ఇథనాల్‌ను కలుపుతున్నది. 2025 నాటికి దీన్ని 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా తమ అవసరాలకు తగినంత ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని కేంద్రం సూచించింది.
ఏటా 43 కోట్ల లీటర్లు అవసరం
తెలంగాణలో వినియోగమవుతున్న పెట్రోలియం ఉత్పత్తుల్లో 20% ఇథనాల్‌ను కలిపేందుకు ఏటా 43 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. చెరుకు నుంచి ఉత్పత్తయ్యే మొలాసిస్తోపాటు నూకలు, బియ్యం, మొక్కజొన్న లాంటి ముడిసరుకుతో ఇథనాల్‌ను తయారుచేసే అవకాశమున్నది. మన రాష్ట్రంలో చెరుకు సాగు అంతగా లేకపోయినప్పటికీ వరి దిగుబడి విపరీతంగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా భారీస్థాయి లో మెగా ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిలో రైస్ మిల్లుల ఏర్పాటుకు దాదాపు 1,150 దరఖాస్తులొచ్చాయి. ఈ మిల్లుల ఏర్పాటుకు ఇప్పటికే జిల్లాలవారీగా భూములను గుర్తించారు. త్వరలో అర్హులను ఎంపికచేసి ఆ భూములు కేటాయించనున్నారు.

అవకాశాలు పుష్కలం
ఇథనాల్ ఉత్పత్తిలో మన రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయి. మన అవసరాలకన్నా అధికంగా ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో వరి దిగుబడి అధికంగా ఇథనాల్ ఉత్పత్తికి అవసరమయ్యే నూకలు, బియ్యం లాంటి ముడిసరుకుకు ఎలాంటి కొరత ఉండదు. మెగా ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్లలో ఏర్పాటయ్యే రైస్ మిల్లులకు అనుబంధంగా ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం.
– భద్రు మాలోత్, కమిషనర్, చక్కెర పరిశ్రమలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Ethanol Petrol
- rice
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

