ఈహెచ్ఎస్లో నిబంధనలు సవరించాలి.. టీయూఎంహెచ్‌ఈయూ
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగుల ఆరోగ్య పథకంలో (ఈహెచ్ఎస్) అనేక నష్టదాయక నిబంధనలు విధించిందని, వెంటనే వాటిని సవరించాలని టీయూఎంహెచ్‌ఈయూ నేతలు ఎండీ ఫసియుద్దీన్, కే యాదవ్ నాయక్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగుల ఆరోగ్య పథకంలో (ఈహెచ్ఎస్) అనేక నష్టదాయక నిబంధనలు విధించిందని, వెంటనే వాటిని సవరించాలని టీయూఎంహెచ్‌ఈయూ నేతలు ఎండీ ఫసియుద్దీన్, కే యాదవ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూల వేతనం నుంచి 1.5 శాతం చందా మినహాయించుకున్నా, ప్రభుత్వం తన వాటా జమ చేయకపోవడం అనాలోచితమని పేర్కొన్నారు.
రూ.3 లక్షల వైద్య పరిమితి విధించడం, ప్రైవేట్ దవాఖానల నెట్‌వర్క్‌తో ఒప్పందాలు కాలయాపన చేయడంతో నగదు రహిత వైద్యం సాధ్యపడటం లేదని తెలిపారు. ఆపద సమయంలో వెల్నెస్ సెంటర్ల చుట్టూ తిరగాలనే షరతును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరిమితి లేని నగదు రహిత వైద్యాన్ని అందించాలని, ఇష్టంలేని ఉద్యోగులను ఈ పథకం నుంచి వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

