ఎంబీఎస్ జ్యువెలరీస్ కేసులో ఆస్తుల తాత్కాలిక జప్తు
ఎంబీఎస్ జ్యువెలరీస్| ఎంబీఎస్ జ్యువెలరీస్ కేసులో ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ సంస్థ ఎంఎంటీసీని ఎంబీఎస్ జ్యువెలర్స్ మోసం చేసిన కేసులో

హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలరీస్ కేసులో ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ సంస్థ ఎంఎంటీసీని ఎంబీఎస్ జ్యువెలర్స్ మోసం చేసిన కేసులో ఎంబీఎస్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీఎస్ జ్యువెలరీస్, ఎంబీఎస్ ఇంపెక్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు సంబంధించి రూ.363 కోట్ల విలువైన 44 స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఎంబీఎస్ నిర్వాహకులు సుఖేశ్ గుప్తా, అనురాగ్ గుప్తా, నీతూ గుప్తా, వందన గుప్తా ఆస్తులు ఉన్నాయి. విచారణలో నిందితులు సహకరించడం లేదని ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మరో రూ.222 కోట్ల జరిమానా విధించింది. బంగారం కొనుగోళ్ల పేరుతో ఎంఎంటీసీకి రూ. 504 కోట్ల నష్టం చేసిందన్న అభియోగంపై ఎంబీఎస్పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- MBS Jewellers
- MMTC
- properties
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

