Dost Schedule | డిగ్రీలో ప్రవేశాలకు.. ‘దోస్త్’ షెడ్యుల్ విడుదల
Dost Schedule | డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి గురువారం విడుదల చేసింది. ఉతన్న విద్యాశాఖ మండలి చైర్మన్ లింబాద్రి షెడ్యూల్ను విడుదల చేశారు.
Dost Schedule | డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి గురువారం విడుదల చేసింది. ఉతన్న విద్యాశాఖ మండలి చైర్మన్ లింబాద్రి షెడ్యూల్ను విడుదల చేశారు. మూడు విడుతల్లో డిగ్రీ ప్రవేశాల దోస్త్ ప్రక్రియ సాగుతుందన్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, జూన్ 16న మొదటి విడతలో డిగ్రీ సీట్ల కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 16 నుంచి 26 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుందన్నారు.
16 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని, జూన్ 30న రెండో విడతలో సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. జూలై 1 నుంచి 5 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, ఒకటి నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, జూలై 10న మూడో విడత సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 17 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు.
దోస్త్ షెడ్యూల్

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

