మతాల పేరుతో రాజకీయాలు చేసే వారిని నమ్మొద్దు : మంత్రి ఎర్రబెల్లి
మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని నమ్మవద్దని, వారికి దేవుడి మీద ప్రేమ కంటే రాజకీయంపైనే ఎక్కువ మక్కువ ఉంటుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
వరంగల్ : మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని నమ్మవద్దని, వారికి దేవుడి మీద ప్రేమ కంటే రాజకీయంపైనే ఎక్కువ మక్కువ ఉంటుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాయపర్తి చర్చిలో ప్రభుత్వం తరుఫున గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలను గుర్తించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పండుగల సందర్భంగా ఆయ మతాలకు చెందిన పేదలకు దుస్తులు, విందులు ఆహార పదార్థాలు అందజేస్తూ అన్ని మతాలను భాగస్వాములు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మతకల్లోలాలతో ఉండే హైదరాబాద్ నగరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించారు.
మందిరాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.క్రిస్మస్ పండుగకు రాష్ట్రంలోని 2 లక్షల 85 వేల మందికి దుస్తులు ఏటా అందజేస్తున్నారని, వీటి విలువ రూ.30 కోట్లు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బి.గోపి, వరంగల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తనాజి వకాడే, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

