మంద పెరిగె.. రంది తీరె
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల వైఫల్యంతో ధ్వంసమైన కుల వృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోశారు. ఒక్కొక్కరికి ఒక్కో పథకం అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
- గొల్ల కురుమలను ఆర్థికంగా ఆదుకొన్న రాష్ట్ర ప్రభుత్వం
- గొర్రెల యూనిట్ల పంపిణీతో యాదవుల్లో ఆర్థిక భరోసా
- 4 లక్షల మందికి గొర్రెల పంపిణీ
- రూ.5 వేల కోట్లు వెచ్చింపు
- రూ.6 వేల కోట్లతో రెండో విడత
- 7 వేల కోట్ల సంపద సృష్టించిన గొల్ల కురుమలు
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల వైఫల్యంతో ధ్వంసమైన కుల వృత్తులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ జీవం పోశారు. ఒక్కొక్కరికి ఒక్కో పథకం అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెల పంపిణీ పథకానికి 2017లో శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అర్హులైన గొల్ల కురుమలందరికీ గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 3.68 లక్షల మందికి ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసింది. ఈ ఏడాది రెండో విడత 31 వేల మందికి పంపిణీ చేసింది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.5,064.42 కోట్లు ఖర్చు చేసింది. లబ్ధిదారులకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయగా, వీటికి 1.35 కోట్ల పిల్లలు పుట్టాయి. మొదటి విడతలో ఒక్కో యూనిట్ (20+1)కు రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. అయితే మార్కెట్లో గొర్రెల ధర పెరగడంతో ప్రభుత్వం లబ్ధిదారులపై భారం పడకుండా ఒక్కో యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచింది.
11 వేల కోట్లు.. 7.61 లక్షల మంది అర్హులు
ఈ పథకం కోసం రూ.11 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు తగ్గట్టుగానే మొదటి విడతలో రూ. 5,064 కోట్లు ఖర్చు చేయగా, రెండో విడత కోసం రూ.6,125 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 8,109 గొర్రెల, మేకల పెంపకం దారుల సొసైటీలు ఉండగా, వీటిలో 7,61, 895 మంది సభ్యులున్నారు. వీరందరికీ ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయనున్నది.
అత్యధిక గొర్రెలు తెలంగాణలోనే..
గొర్రెల పంపిణీ పథకం గొల్ల కురుమల ఆదాయాన్ని పెంచడంతోపాటు రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచింది. ఈ పథకం అమలు తర్వాత దేశంలో అత్యధిక గొర్రెలున్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్ 1గా నిలిచింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో గొర్రెల సంఖ్య 1.28 కోట్లు కాగా, ఇప్పుడు ఇది 1.91 కోట్లకు పెరిగింది. ఈ లెక్కలు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం గమనార్హం. ఈ పథకం ద్వారా సుమారు రూ.7 వేల కోట్ల సంపద సృష్టించడం విశేషం. గొర్రెల పంపిణీ ప్రారంభం తర్వాత 1.22 లక్షల టన్నుల మాంసం మార్కెట్లోకి వచ్చింది. అదే విధంగా 2014-15తో పోల్చితే రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి 106.29 శాతం పెరిగింది..

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

