Frankfurt | హైదరాబాద్ టు ఫ్రాంక్ఫర్ట్ డైరెక్ట్ ఫ్లైట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
Frankfurt | హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా వివిధ దేశాలకు విమానాల రాకపోకలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ సిటీకి హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా విమానాలు నడవనున్నాయి. ఈ విమాన రాకపోకలకు సంబంధించి ఎయిపోర్టు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు లుఫ్తాన్సా విమానం రాకపోకలు కొనసాగించనుంది. ఈ మార్గంలో తొలి విమానం 2024, జనవరి 16వ తేదీన ప్రారంభం కానుంది. ఈ విమానంలో 26 బిజినెస్ క్లాస్ సీట్లు, 21 ప్రీమియం ఎకానమీ సీట్లు, 247 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. తొలి విమానం ఫ్రాంక్ఫర్ట్ నుంచి జనవరి 16న ఉదయం 10 గంటలకు బయల్దేరి, హైదరాబాద్కు రాత్రి 11 గంటలకు చేరుకుంది. మళ్లీ హైదరాబాద్ నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంటకు బయల్దేరి, ఉదయం 6:10 గంటలకు చేరుకోనుంది. ఫ్రాంక్ఫర్ట్ – హైదరాబాద్ మధ్య 8 గంటల 30 నిమిషాల పాటు ప్రయాణం కొనసాగనుంది.
ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు మంగళ, శుక్ర, ఆదివారాల్లో విమానాలు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ నుంచి సోమ, బుధ, శనివారాల్లో అందుబాటులో ఉండనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!