రంగు మారితే పాడైపోయినట్టే!
ప్యాక్ చేసిన ఆహార పదార్థాల నాణ్యత ఎంత? ఎన్ని రోజుల అవి చెడిపోకుండా ఉంటాయి? చెడిపోయేవి ఉంటే కొనేకంటే ముందే గుర్తించేదెలా? ఆహార పదార్థాల నాణ్యతను ప్యాకెట్ కవర్ ఆధారంగా తెలుసుకొనే వీలున్నదా? ఇలాంటి ప్రశ్నలకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమాధానం చెప్పేలా సరికొత్త ప్యాకేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
- ఆహార పదార్థాల నాణ్యతను తెలిపే స్మార్ట్ ప్యాకేజింగ్ టెక్నాలజీ
- సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్యాక్ చేసిన ఆహార పదార్థాల నాణ్యత ఎంత? ఎన్ని రోజుల అవి చెడిపోకుండా ఉంటాయి? చెడిపోయేవి ఉంటే కొనేకంటే ముందే గుర్తించేదెలా? ఆహార పదార్థాల నాణ్యతను ప్యాకెట్ కవర్ ఆధారంగా తెలుసుకొనే వీలున్నదా? ఇలాంటి ప్రశ్నలకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమాధానం చెప్పేలా సరికొత్త ప్యాకేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. మైసూర్‌లోని ప్రధాన కేంద్రంగా, హైదరాబాద్‌లో రిసోర్స్ సెంటర్ ఆధారంగా ఆహార ఉత్పత్తులపై అధ్యయనం చేసే ఈ సంస్థ.. తాజాగా ఆహార నాణ్యతను ప్యాకెట్ ఆధారంగా గుర్తించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పాలపై చేసిన అధ్యయనం ఆధారంగా లాక్టోబాసిల్లస్ పెరుగుదలను బట్టి ప్యాకేజ్ లేబుల్‌పై ఉండే క్వాలిటీ ఇండికేటర్ రంగు మారిపోయేలా, స్మార్ట్ ప్యాకేజింగ్ విధానాన్ని రూపొందించింది. దీంతో పాలు నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నాయా? తదితర అంశాలను ప్యాకింగ్ టెక్నాలజీ ద్వారా తెలుసుకునే వీలు ఉంటుందని సీఎఫ్టీఆర్ఐ వర్గాలు తెలిపాయి.
నాణ్యత తెలిసిపోతుందిలా..
ప్యాకెట్ లోపల, బయట ఏర్పాటు చేసిన ఇండికేటర్లు నాణ్యత సూచికలుగా పనిచేస్తాయి. ప్యాకేజింగ్ చేసిన తర్వాత మారిపోయే ఆహార నాణ్యతను బట్టి లేబుల్ ఇండికేటర్ రంగులో మార్పులు వస్తాయి. దీని ద్వారా కొనుగోలు చేయకముందే నాణ్యతను తెలుసుకోవచ్చు. ప్యాక్ కవర్ లోపల ఉండే మెంబ్రేన్.. ఫిల్టర్‌గా పనిచేసి ఆహారంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించి ఇండికేట్ చేస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

