డీజీపీ గారూ ఇదేం భాష?
డీజీపీ గారూ ఇదేం భాష.. ఇటీవల కొందరు పోలీసులు పలుచోట్ల ప్రజలపై తీవ్ర దుర్భాషలాడిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి..
- లారీ డ్రైవర్‌పై చేయిచేసుకున్న ట్రాఫిక్ ఎస్సై
- వినరాని, రాయలేని భాషలో దుర్భాషలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ప్రజలే జీతాలిస్తున్నారని గుర్తుంచుకోవాలి
- కేటీఆర్ ట్వీట్.. జవాబివ్వాలని డీజీపీకి డిమాండ్
- ఆ పోలీసు అధికారిని బదిలీ చేసినట్టు వివరణ
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): డీజీపీ గారూ ఇదేం భాష.. ఇటీవల కొందరు పోలీసులు పలుచోట్ల ప్రజలపై తీవ్ర దుర్భాషలాడిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఓఆర్ఆర్పై ట్రాఫిక్ ఎస్సై దాడి, దుర్భాషలాడిన ఘటన వెలుగుచూసింది. ఇది పోలీస్ శాఖకు, మీకు అంగీకారయోగ్యమేనా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఓఆర్ఆర్ గండి మైసమ్మ ఆలయ సమీపంలో గురువారం ట్రాఫిక్ ఎస్సై ఓ వాహనదారుడిపై చేయిచేసుకొని దుర్భాషలాడిన వీడియోపై కేటీఆర్ స్పందించారు. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై, మాట్లాడుతున్న భాషపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినరాని, వార్తా పత్రికల్లో రాయలేని భాషలో సాధారణ పౌరులపై పోలీస్ సిబ్బంది విరుచుకుపడుతున్నారని విమర్శించారు.
పోలీసులకు, ప్రభుత్వ సిబ్బందికి ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రజలతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ప్రజలతో వ్యవహరించే విషయంలో పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. ఓఆర్ఆర్పై ట్రాఫిక్ ఎస్సై దౌర్జన్యం, దుర్భాషల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై గురువారం ట్వీట్ చేసిన కేటీఆర్.. డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ స్టేషన్ నుంచి బదిలీ చేశాం: పోలీస్‌శాఖ
కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీస్ శాఖ స్పందించింది. లారీ డ్రైవర్‌పై దాడి చేసి, దుర్భాషలాడిన ట్రాఫిక్ ఎస్సై ఘటన సైబరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో జరిగినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సదరు ఎస్సైని ఆ స్టేషన్ నుంచి బదిలీ చేశామని ఎక్స్‌లో పేర్కొన్నారు.
చెట్టొకటైతే.. విత్తనం మరొకటవుతుందా?
‘చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా? పాలించేటోడు ఎట్లుంటడో! కింద వ్యవస్థ కూ డా అట్లనే ఉంటది’ అని బీఆర్ఎస్ పార్టీ ఓఆర్ఆర్పై ట్రాఫిక్ ఎస్సై ఘటనను అభివర్ణించిం ది. ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లా రీ డ్రైవర్‌పై చేయిచేసుకొని దుర్భాషలాడిన ట్రా ఫిక్ ఎస్సై తీరును ఆక్షేపించింది. తప్పు చేస్తే జరిమానా విధించాలి లేదా కేసు నమోదు చేయా లి. కానీ తీవ్ర దుర్భాషలాడటం ఏంటి? అని ప్రశ్నించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేసి బూతుల పోలీసింగ్ తెచ్చుడేనా మీ మార్పు? అని నిలదీసింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

