2026 తర్వాతే తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత మాత్రమే జరగనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. 2026లో జనాభా లెక్కలు ప్రచురించబడిన తర్వాత ప్రతి రాష్ట్ర అసెంబ్లీలోని సీట్ల సంఖ్య సర్ధుబాటు చేయబడుతుందని పేర్కొంది. జమ్ముకశ్మీర్‌తో పాటు తెలంగాణలో నియోజకవర్గాలను ఒకేసారి పునర్విభజన చేసేందుకు కేంద్రం ఏమైనా ఆలోచిస్తుందా అన్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఇంటర్-అలియా సెక్షన్ 26 (1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 225కి అదేవిధంగా తెలంగాణ శాసనసభ స్థానాల సంఖ్య 119 నుండి 153 కి పెంచాలి. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు 2026 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి కేంద్రం ఆసక్తిగా ఉందన్నారు. దీని ప్రకారం నూతన నియోజకవర్గాలు 2031కి ముందు ఉనికిలోకి వచ్చే అవకాశం లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

