Death sentence | దీక్షిత్ రెడ్డి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి మరణ శిక్ష
Death sentence | మూడేళ్ల క్రితం జరిగిన దీక్షిత్ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు మందసాగర్‌కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్: మూడేళ్ల క్రితం జరిగిన దీక్షిత్ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు మందసాగర్‌కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ దేవత, పోలీసుల చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లాలో 2020 అక్టోబర్‌లో వసంత, రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డి హత్య జరిగింది. స్థానికంగా పంచర్ షాప్ నిర్వహించే మందసాగర్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైలులో పెట్టారు.
ఈ కేసు విచారణ పూర్తి కావడంతో తాజాగా మహబూబాబాద్ జిల్లా కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మందసాగర్.. కేసముద్రం మండలం అన్నారం గ్రామ శివారులోని ధానమయ్య గుట్టపై హత్యచేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఆ తర్వాత అదే రోజు రాత్రి దీక్షిత్ రెడ్డి తండ్రి రంజిత్ రెడ్డికి ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేసి రూ.45 లక్షలు డిమాండ్ చేశాడు. రంజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల తర్వాత ధానమయ్య గుట్టపై దీక్షిత్ మృతదేహాన్ని కనిపెట్టారు. నిందితుడు మందసాగర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

