DDMS | డీడీఎంఎస్‌లో పారామెడికల్, వొకేషనల్ కోర్సుల దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు
DDMS | దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ వొకేషనల్ కోర్స్ సెంటర్లో వివిధ పారామెడికల్ (అలైడ్ హెల్త్ కేర్), వొకేషనల్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
DDMS | ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 15 : దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ వొకేషనల్ కోర్స్ సెంటర్లో వివిధ పారామెడికల్ (అలైడ్ హెల్త్ కేర్), వొకేషనల్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్, హెల్త్‌కేర్ మల్టీపర్పస్ వర్కర్ (నర్స్ కోర్స్), ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డయాలసిస్ అసిస్టెంట్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత పదవతరగతి అని వివరించారు. రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ అసిస్టెంట్, క్యాథ్‌ల్యాబ్ టెక్నీషియన్, పర్ఫ్యుజన్ టెక్నీషియన్ వంటి పారా మెడికల్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హత ఇంటర్మీడియట్ అని చెప్పారు. అన్ని వయసుల వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 29వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 8309037134 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

