మైనార్టీ సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల గడువు పొడగింపు
TS Minority | తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న సబ్సిడీ రుణాలకు విధించిన దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి 9వ తేదీ వరకు పొడగించారు. ఈ మేరకు మైనార్టీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న సబ్సిడీ రుణాలకు విధించిన దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి 9వ తేదీ వరకు పొడగించారు. ఈ మేరకు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్ గురువారం వెల్లడించారు. 2022-23 సంవత్సరానికి గాను మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద అర్హులైన మైనార్టీలకు సబ్సిడీ రుణాలుగా అందజేయాలని నిర్ణయించామని వివరించారు. రూ.లక్ష యూనిట్‌కు 80శాతం, రూ.2లక్షల యూనిట్‌కు 70 శాతం సబ్సిడీతో రుణాలను మంజూరు చేయనుండగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా అందజేయనున్నామని తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణకు తొలుత 5వ తేదీ వరకు విధించిన గడువు ముగియగా, మరింత మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 9వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. మైనార్టీ వర్గానికి చెంది ఉండి.. 22 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల ఆదాయం, పట్టణ ప్రాంతాల వారయితే రూ.2 లక్షల వార్షిక ఆదాయం మించని వారు సబ్సిడీ రుణాలకు అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అవకాశాన్ని మైనార్టీ యువత సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా స్వశక్తితో ఎదగాలని చైర్మన్ ఈ సందర్భంగా సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

