అభ్యంతరాలుంటే ఆఫీస్కొచ్చి చర్చించవచ్చు
గోదావరిలో నీటి లభ్యతపై 2023లో చేసిన అధ్యయనంపై అభ్యంతరాలుంటే తమ కార్యాలయానికి వచ్చి చర్చించవచ్చని ఇరు రాష్ర్టాలకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు ప్రత్యేకంగా లేఖ రాసింది.
- గోదావరిలో నీటి లభ్యతపై ఏపీకి సీడబ్ల్యూసీ సూచన
- ఆ లెక్కల ప్రకారమే ప్రాజెక్టులకు అనుమతులిచ్చామని వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): గోదావరిలో నీటి లభ్యతపై 2023లో చేసిన అధ్యయనంపై అభ్యంతరాలుంటే తమ కార్యాలయానికి వచ్చి చర్చించవచ్చని ఇరు రాష్ర్టాలకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు ప్రత్యేకంగా లేఖ రాసింది. ఇరు రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ సీడబ్ల్యూసీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటుచేసింది. సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమప్రసాద్ నేతృత్వంలో కొనసాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ గతంలో మాదిరిగానే గోదావరిలో నీటి లభ్యతపై 2023లో సీడబ్యూసీ చేసిన అధ్యయనంపై అభ్యంతరాలను వ్యక్తంచేసింది. మరోసారి నీటి లభ్యతపై అధ్యయనం చేయించాలనే డిమాండ్‌ను మరోసారి లేవనెత్తింది. ఆ సమావేశంలో ఏపీ లేనెత్తిన అభ్యంతరాలపై తాజాగా సీడబ్ల్యూసీ స్పష్టమైన సమాధానమిచ్చింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాసింది. ఏపీ వాదనలను కొట్టిపడేసింది. 2023 గోదావరి నీటి లెక్కల రిపోర్టుపై గతంలోనే వివరణలు ఇచ్చామని స్పష్టం చేసింది.
పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టు ప్రతిపాదనలపై జరిగిన మీటింగ్‌లోనూ కూలంకషంగా చర్చించామని గుర్తుచేసింది. 2023లో చేసిన అధ్యయనం ఆధారంగానే ఆ ప్రాజెక్టు అప్రైజల్ కొనసాగించామని, అప్పుడు దానిపై ఏపీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపింది. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులను ఆ నీటి లభ్యత అధ్యయనం ప్రకారమే మంజూరు చేశామని, ఆ రాష్ట్రం నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో 2023లో సీడబ్యూసీ చేసిన అధ్యయనాన్ని ఇరు రాష్ర్టాలు అంగీకరించినట్టుగా భావిస్తున్నామని పేర్కొన్నది. అభ్యంతరాలున్నా, వివరణాలు కావాలన్నా కార్యాలయానికి వచ్చి చర్చించవచ్చని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

