Floods | వరద నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన సీఎస్
Floods | రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో సంభవించిన వరద నష్టంపై కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నివేదించారు.
Floods | రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో సంభవించిన వరద నష్టంపై కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నివేదించారు. కర్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం సీఎస్, ప్రభుత్వ సీనియర్ అధికారులతో చర్చలు జరిపింది. అతి తక్కువ సమయంలో వాతావరణ శాఖ అందించిన హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తగ్గించగలిగామని సీఎస్ చెప్పారు.
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పరిస్థితిని సమీక్షించి, వరద, పునరావాస, సహాయక చర్యలను పర్యవేక్షించారని సీఎస్ చెప్పారు. సహాయక చర్యలు చేపట్టేందుకు డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరు రాష్ట్రమంత్రులు హుటాహుటిన ఖమ్మం చేరుకొని సహాయక కార్యక్రమాలను వేగవంతం చేశారని, ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగానికి వరద సహాయం, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి నిధులు వెంటనే విడుదల చేశామని సీఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను అందించడానికి వీలుగా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్తో సమానంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ప్రత్యేక బృందాలకు శిక్షణ, ఇతర లాజిస్టిక్స్ ఏర్పాట్లలో ఎన్డీఎంఏ మద్దతు కావాలని కోరారు. భారీ వర్షాల సమయంలో ఎయిర్ రెస్క్యూ ఆపరేషన్ల సమస్యను సీఎస్ ప్రస్తావించారు. సవాళ్లు ఎదుర్కోవడంలో కేంద్రం సహకారాన్ని కోరారు.
ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ చెట్లు కూలిన సంఘటనలను, పర్యావరణ విపత్తు సమస్యను ప్రస్తావించారు. విపత్తుకు మూల కారణాలు తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని కేంద్ర బృందం సీఎస్‌కు సూచించింది. విపత్తు నిర్వహణశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వరదల కారణంగా సంభవించిన నష్టాలను, ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర బృందానికి వివరించారు. వరద నష్టం ప్రాథమిక అంచనాలు రూ.5,438 కోట్లుగా ఉన్నాయని, పూర్తిస్థాయి అంచనా ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. వ్యవసాయం, రోడ్లు, భవనాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఇంధనం, పశుసంవర్ధక, అటవీ శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందాలకు జరిగిన నష్టాన్ని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

