Telangana | కన్నీళ్లు కాలువలై పారుతున్నా..! తడవని మడి
Telangana | కనికరం లేని కాంగ్రెస్ పాలనలో తెలంగణ మాగాణంలో సాగు భారమవతున్నది. బతుకులు ఛిద్రమవుతున్నవి. అన్నం పెట్టిన చేతులతోనే పంటలకు నిప్పు పెడుతున్నరు.
Telangana | కనికరం లేని కాంగ్రెస్ పాలనలో తెలంగణ మాగాణంలో సాగు భారమవతున్నది. బతుకులు ఛిద్రమవుతున్నవి. అన్నం పెట్టిన చేతులతోనే పంటలకు నిప్పు పెడుతున్నరు. కాడి వదిలేసి, చేళ్లు బీళ్లు పెట్టి పొట్టకూటి కోసం అన్నదాతలు పట్నం బాట పడుతున్న దుస్థితి నేడు తెలంగాణలో నిత్యకృత్యమ వుతున్నది. నీళ్లు లేక, కరెంట్ రాక కండ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు కన్నీరుమున్నీరవు తున్నారు. సర్కార్ సాయం చేయకున్నా అప్పులు చేసి పంటలు వేసిన రైతలు కన్నీటితో సాగును కొనసాగిస్తున్నారు.
పాలకులు సాగుకు నీళ్లు, కరెంట్ ఇవ్వకున్నా కావడి మోసి, ట్యాంకర్లు తెచ్చి పంటల గొంతులు తడుపుతున్నా ఫలితం కానరావడం లేదు. చంటి బిడ్డలా కాపాడుకున్న పంటలు కండ్లముందే ఎండిపోతుంటే విలవిల్లా డిపోతున్నారు. సాగును ఎలాగైనా బాగు చేసుకోవాలనే ఆరాటంతో అయినకాడికి అప్పు చేసి వందల ఫీట్ల లోతులో బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్క నీరు రాకపోవడంతో కన్నీళ్లపర్యంతమవుతున్నారు. ఇందుకు బల్ల మైసమ్మ మహిళా రైతు సేద్యమే నిదర్శనం.
మైసమ్మ మనోవేదన..
వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్ జిల్లా దోమ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బల్ల మైసమ్మ అనే మహిళా రైతు ఆరు ఎకరాల్లో నాటు వేసింది. కరెంటు లేకపోవడంతో వేసిన పంట ఎండిపోతున్న కారణంగా పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటంతో బోరు వేసింది. అది కూడా ఫోయిల్ అవడంతో 800 వందల ఫీట్ల మరో బోర్ వేసినా ప్రయోజనం లేకపోవడంతో కన్నీరు పెట్టున్న దృశ్యం పలువురిని కలిచివేస్తున్నది. మరోరైతు కొండని బాబయ్యది మరో వ్యథ.
24 గంటల కరెంటు ఇస్తారని నమ్మకంతో తన సొంత పొలం ఎకరం కవులుగా మరో ఏడు ఎకరాలు తీసుకొని పంట సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో కరెంటు కోతల వల్ల వేసిన పంట పొలం ఎండు ముఖం పట్టింది. లోవాల్టేజిల కారణంగా వారం రోజులలో మూడుసార్లు బోరు మోటర్ కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలా తెలంగాణలో ఒక్క రైతును కదిలించిన కన్నీటి వ్యథలు కట్టలు తెంచుకుంటాయి. నాటి పదేళ్ల పాలనను యాది చేసుకొని నేటి పాలకులపై అన్నదాతలు దుమ్మొత్తి పోస్తున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నరు.

బల్ల మైసమ్మ

ఎండిన పొలంలో దుఃఖిస్తున్న రైతు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana | కన్నీళ్లు కాలువలై పారుతున్నా..! తడవని మడి
‘గుర్రంపోడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి’
Helicopter Crash | ఆ హెలికాప్టర్ కూలిపోయింది.. పైలట్ సహా ఆరుగురు దుర్మరణం..!
Anant Singh | బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశం
Cult Review | ‘కల్ట్’ సినిమా రివ్యూ.. విశ్వక్సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

